Viral: శృంగారం చేస్తుండగా కండోమ్ తొలగించిన యువకుడు.. దిమ్మతిరిగే షాకిచ్చిన యువతి.. కట్ చేస్తే..

|

Aug 01, 2022 | 7:10 PM

ఆ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఒకట్రెండు సార్లు డేట్ నైట్‌కి వెళ్లి..

Viral: శృంగారం చేస్తుండగా కండోమ్ తొలగించిన యువకుడు.. దిమ్మతిరిగే షాకిచ్చిన యువతి.. కట్ చేస్తే..
Condom
Follow us on

ఆ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అయ్యారు. ఆ తర్వాత ఒకట్రెండు సార్లు డేట్ నైట్‌కి వెళ్లి.. లైంగికంగా కలవాలని నిర్ణయించుకున్నారు. అనంతరం శృంగారంలో పాల్గొన్నారు. సీన్ కట్ చేస్తే.. వీళ్ల స్టోరీ కోర్టు రూమ్‌లో ఎండ్ అయింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..!

వివరాల్లోకి వెళ్తే.. 2017లో సోషల్ మీడియా వేదికగా ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ తర్వాత డేటింగ్ చేసి.. ఆపై తాము లైంగికంగా అనుకూలత కలిగి ఉన్నామో లేదోనన్న విషయాన్ని తెలుసుకునేందుకు శృంగారంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. ఇక సెక్స్ చేసుకునే సమయంలో ఆ యువతి కండోమ్ ధరించాలని పట్టుబట్టింది. దానికి ఆ వ్యక్తి సరేనన్నాడు.

సీన్ కట్ చేస్తే.. యువతికి తెలియకుండా కండోమ్ తొలగించి శృంగారం చేశాడు ఆ యువకుడు. కొద్దిరోజులకు ఈ విషయం తెలుసుకున్న యువతి.. హెచ్ఐవీ సోకకుండా ఉండేందుకు చికిత్స చేయించుకుంది. అనంతరం యువకుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసింది. మొదటిగా ఈ కేసును ట్రయిల్ కోర్టు కొట్టివేయగా.. ఆ మహిళ న్యాయం కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

ఇవి కూడా చదవండి

కాగా, వాదోపవాదనలు విన్న కెనడా సుప్రీం కోర్టు.. ”పార్టనర్‌కు తెలియకుండా కండోమ్‌ను తొలగించి.. శృంగారంలో పాల్గొనడం అత్యాచార నేరంగా పరిగణిస్తామని” పేర్కొంది. ‘కండోమ్ లేకుండా చేసే సెక్స్.. కండోమ్‌తో పాల్గొనే లైంగిక సంపర్కం.. రెండూ భిన్నమైనవి’ అని కోర్టు తెలిపింది. కండోమ్ లేకుండా సెక్స్‌లో పాల్గొనాలంటే.. పార్ట్‌నర్స్ ఇద్దరి అంగీకారం తప్పనిసరి అని తీర్పు వెల్లడించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..