Viral Photo: ఆదివారం వార్త పత్రికలకు అనుబంధంగా వచ్చే మ్యాగజైన్‌లను చాలా ఆసక్తిగా చూస్తుంటాం. ఎందుకంటే వీటిలో వార్తల కంటే ఎక్కువగా ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి కాబట్టి. రెగ్యులర్ న్యూస్ కాకుండా ఫన్నీ విషయాలు, పదకేలీ ఇలా మెదడుకు పదును పెట్టే పజిల్స్ ఉంటాయి. అందుకే రోజూ న్యూస్ పేపర్ చదవని వారు కూడా ఆదివారం మ్యాగజైన్‌ను చూస్తుంటారు. ఇక వీటిల్లో ఉండే మరో ఇంట్రెస్టింగ్ పజిల్.. ఫొటో పజిల్. ఒక ఫొటోను చూపించి అందులో ఫలానా వస్తువు ఉంది గుర్తించండి అంటూ ప్రశ్నలు ఇస్తుంటారు. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారుతోంది. సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి పేపర్‌లు చదివేవారు చాలా తగ్గిపోయారు.
ఇక మ్యాగజైన్‌లో పజిల్స్ చేసే వారి సంఖ్య కూడా తగ్గిపోయింది. అయితే సోషల్ మీడియా దీనిని రీప్లెస్ చేసింది. ఇప్పుడు ఇలాంటి ఫొటో పజిల్స్ కూడా సోషల్ మీడియాలోనే వస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ ఫొటోనే నెట్టింట వైరల్‌గా మారింది. పైన కనిపిస్తోన్న ఫొటోను చూస్తుంటే ఎండిపోయిన చెట్టు బెరుడులా కనిపిస్తోంది. కదూ.. అయితే అందులో ఓ కీటకం వాలి ఉందన్న విషయం మీకు తెలుసా.? ఓసారి దీక్షణంగా చూడండి కనిపిస్తుందేమో.. కనిపించకపోతే కింద సదరు కీటకాన్ని రౌండప్ చేసిన ఫొటో ఉంది చూసేయండి. అయితే అంతటితో ఆగకుండా ఈ ఫొటోను మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి వారు కనుక్కోగలరేమో సవాల్ విసరండి.
Mars Quakes: అంగారకుడిపై కూడా ప్రకంపనలు.. ఒక నెలలోనే మూడు సార్లు వణికిన అరుణ గ్రహం