ఆప్టికల్ ఇల్యూషన్(Optical Illusion) గురించి మీరు వినే ఉంటారు.. ఇందులో కంటికి కనిపించేది ఒకటయితే.. కనిపించనిది వేరొకటి ఉంటుంది. మీ కంటి చూపు ఎంత మెరుగ్గా ఉందో ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు చెప్పకనే చెప్పేస్తాయి. ఆప్టికల్ ఇల్యూషన్‌లో ఉండే రహస్యాన్ని చేధించాలంటే.. మీ మెదడు చురుగ్గా పని చేయడమే కాదు.. కళ్లకు కూడా పదునుండాలి. తాజాగా ఈ కోవకు చెందిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైన పేర్కొన్న చిత్రంలో ఓ సంఖ్య దాగుంది. అదేంటో చెప్పాలి. మీరు అందులో ఉన్న సంఖ్యను కనిపెట్టడం కొంచెం కష్టమేనని చెప్పాలి. మీరు నిశితంగా పరిశీలిస్తే గానీ ఆ సంఖ్య ఎంతన్నది చెప్పలేరు. ‘telugufunworld’ అనే ట్విట్టర్ పేజీ ఈ పజిల్‌ను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి.. నెటిజన్లకు సవాల్ విసురుతోంది. మరి మీకు కూడా అందులో నెంబర్ కనిపిస్తోందా.? కనిపిస్తే అదేంటో చెప్పగలరా.! నిశితంగా ఫోటోను పరిశీలిస్తే.. మీరు కచ్చితంగా ఆ నెంబర్‌ను కనిపెట్టొచ్చు. కళ్లకు పదునుపెట్టేవాళ్లు ఈ పజిల్‌ను ఈజీగా సాల్వ్ చేసేశారు. కానీ మిగిలినవారు ఫెయిల్ అయ్యారు. కొంతమంది ఈ ఫోటోను చూసి 2240 అని కామెంట్ చేయగా.. మరికొందరు 2246 అని అన్నారు. అలాగే ఇంకొందరు అయితే అందులో బ్లాక్ డాట్స్ తప్ప.. ఇంకేం లేదని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మరి మీరేంటారు. అందులో ఏ సంఖ్య దాగుందో కనిపెట్టండి.. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి ట్రై చేయండి.. సమాధానం దొరక్కపోతే క్రింద ఫోటోను చూడండి..
Here is the answer.. pic.twitter.com/CdiHsazOPd
— telugufunworld (@telugufunworld) April 27, 2022