Optical Illusion: మీకో సవాల్.. ఈ చిత్రంలో సింహం దాగుంది భయ్యా.. 10 సెకన్లలో గుర్తిస్తే గ్రేటే..

| Edited By: Ravi Kiran

Aug 06, 2022 | 4:37 PM

ఓ ప్రాంతంలో జింకలు, జీబ్రాలు విశ్రాంతి తీసుకుంటుండగా.. ఓ సింహం అక్కడికి చేరుకొని వేట కోసం నిరీక్షిస్తోంది. ఈ ఆప్టికల్ ఇల్యూజన్ పరీక్షలో ట్విస్ట్ ఎమిటంటే.. సింహాన్ని 10 సెకన్లలోపు గుర్తించాలి.

Optical Illusion: మీకో సవాల్.. ఈ చిత్రంలో సింహం దాగుంది భయ్యా.. 10 సెకన్లలో గుర్తిస్తే గ్రేటే..
Viral Pic
Follow us on

Optical Illusion: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో ఫొటోలు, వీడియోలు, పజిల్‌లు తెగ వైరల్ అవుతాయి. వాటిలో ఎక్కువగా ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు ట్రెండ్ అవుతుంటాయి. ఇవి నెటిజన్లను సవాల్ చేస్తుంటాయి. అయితే నెటిజన్లు కూడా ఈ చిత్రాల్లో దాగున్న వాటిని కనుగొనేందుకు తెగ ఇష్టపడుతుంటారు. ఇవి మన మెదడు, చూపును పనితీరును మెరుగుపరుస్తాయి. తాజాగా ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం తెగ వైరల్ అవుతోంది. ఈ ఆప్టికల్ ఇల్యూజన్ చిత్రం అడవి ప్రాంతానికి సంబంధించినది. ఓ ప్రాంతంలో జింకలు, జీబ్రాలు విశ్రాంతి తీసుకుంటుండగా.. ఓ సింహం అక్కడికి చేరుకొని వేట కోసం నిరీక్షిస్తోంది. ఈ ఆప్టికల్ ఇల్యూజన్ పరీక్షలో ట్విస్ట్ ఎమిటంటే.. సింహాన్ని 10 సెకన్లలోపు గుర్తించాలి. అలా గుర్తిస్తే గ్రేట్ అంటూ ఓ యూజర్ సవాల్ విసిరాడు. ప్రస్తుతం ఈ చిత్రం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కొంతమంది దీనిని కనుగొంటుంటే.. మరికొంతమంది కనుగొనలేకపోతున్నారు. అయితే శాయశక్తులా ప్రయత్నించి గుర్తించిన వారు సింహాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ చిత్రంలో దాగున్న మృగరాజు సింహాన్ని నిర్ణీత సమయంలో గుర్తించండి.

10 సెకన్లలో జింకల మధ్య దాగున్న సింహాన్ని గుర్తించండి..

Viral

జింకలు, జీబ్రాల సమూహంలో సింహాన్ని కనుగొనడం అంత ఈజీ కాదు.. ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ చిత్రం క్షుణ్ణంగా పరిశీలిస్తే సాధ్యమవుతుంది. 10 సెకన్లలోపు జింకల గుంపు మధ్య దాగున్న సింహాన్ని గుర్తించారా..? గుర్తించకపోతే.. మరికొంత సమయంలో తీసుకోనైనా గుర్తించండి.. ఒక్కసారి చిత్రాన్ని మళ్లీ కింద నుంచి పై వరకు.. ఇరువైపులా చూడండి..

ఇవి కూడా చదవండి

Viral Pic

సింహాన్ని ఇంకా గుర్తించకపోతే.. జింకల గుంపు మధ్య దాగున్న సింహాన్ని ఈ కింద ఇచ్చిన ఫొటోలో చూడండి..

Lion

ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం మీకూ నచ్చితే.. మీ స్నేహితులకు కూడా షేర్ చేసి ఎంజాయ్ చేయండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..