Viral Photo: ఫొటోగ్రఫీ అంటే ఒకప్పుడు కేవలం ప్రొఫెషనల్స్‌కు మాత్రమే పరిమితం అనుకునే వాళ్లం. కానీ ఇప్పుడు హైక్వాలిటీ కెమెరాలతో స్మార్ట్ ఫోన్‌లు (Smart Phone) అందుబాటులోకి రావడంతో ప్రతీ ఒక్కరూ ఫొటోగ్రాఫర్‌గా మారిపోయారు. కాస్త ఆసక్తిగా కనిపిస్తే చాలు వెంటనే కెమెరాల్లో బంధించేస్తున్నారు. తమ కెమెరా పనితీరును ప్రపంచానికి చాటడానికి వెంటనే సోషల్ మీడియాలో (Social Media) అప్‌లోడ్ చేస్తున్నారు. ఇలా రకరకాల ఫోటోలు రోజూ నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కొంత మంది తమ ఫొటోలతో నెటిజన్లకు పని పెడుతున్నారు. ఫోటోల్లో దాగి ఉన్న జంతువులను గుర్తించండి అంటూ తెగ వైరల్ చేస్తున్నారు.
తాజాగా ఇలాంటి ఓ ఫోటోనే ప్రస్తుతం నెట్టింట తెగ సందడి చేస్తోంది. పైన కనిపిస్తున్న ఫోటో చూస్తుంటే ఏం కనిపిస్తోంది. ఏముంది కొండకు అనుకొని ఉన్న రాళ్లు కనిపిస్తున్నాయని అంటారా.? అయితే అందులో ఓ కుందేలు దాక్కొని ఉంది. ఆ కుందేలును గుర్తించిన ఫోటోగ్రాఫర్ తన కెమెరాల్లో బంధించాడు. రాళ్ల మధ్యలోనే దాగి ఉన్న ఆ బుజ్జి కుందేలు తధేకంగా చూస్తోంది. ఓసారి ఫోటోను ఏకగ్రాతతో చూడండి మీకూ ఆ కుందేలు కనిపిస్తుంది.
అయితే సదరు కుందేలు కూడా అక్కడ ఉన్న రాళ్ల రంగునే పోలి ఉండడంతో దానిని గుర్తించడం కాస్త కష్టమని చెప్పాలి. ఎంత ట్రై చేసినా కుందేలు కనిపించడం లేదా. అయితే ఓసారి ఫోటో మధ్యలో చూడండి, రాళ్ల మధ్య ఉన్న చిన్న రంధ్రం కనిపిస్తోందా.. అక్కడే కుందేలు ఉంది. దాని కన్ను కూడా కెమెరావైపే ఉంది. ఇప్పటికీ కూడా కనిపించకపోతే ఈ కింద ఉన్న ట్వీట్‌లో జవాబును చూసేయండి..
find the rabbit.. @WhatsTrending @TrendingWeibo @TheViralFever @the_viralvideos @itsgoneviraI #Trending #Viral pic.twitter.com/fyQw6KReof
— telugufunworld (@telugufunworld) April 18, 2022
ఆర్థరైటిస్ నొప్పితో బాధపడుతున్నారా? ఇవి తింటే వెంటనే ఉపశమనం..