Viral Photo: మీ మెదడుకు మేత.. ఈ ఫోటోలో పామును కనిపెడితే మీ కళ్లలో పవర్ ఉన్నట్లే.. చాలామంది ఫెయిల్!
ఆఫీస్ తలనొప్పిని.. బెడ్ టైం రిలాక్సేషన్‌ను ఇవ్వడానికి ఫోటో పజిల్స్ సరైన ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇవి మీ మెదడుకు మేత వేయడమే కాదు..
ఆఫీస్ తలనొప్పిని.. బెడ్ టైం రిలాక్సేషన్‌ను ఇవ్వడానికి ఫోటో పజిల్స్ సరైన ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇవి మీ మెదడుకు మేత వేయడమే కాదు.. కళ్లకు కూడా పదునుపెడతాయి. అందులో ఏముందో కనిపెట్టేందుకు తగ్గేదేలే అన్నట్లుగా మనం ఓ పట్టు పడుతుంటాం. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫోటో పజిల్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. ఆ కోవకు చెందిన ఓ పజిల్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. ఓసారి ఫోటోను చూసేయండి.. చూశారా.! పైన పేర్కొన్న ఫోటోలో ఓ పాము దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. చూడటానికి కార్టున్ పిక్చర్ అని తీసి పారేయకండి. అందులో పామును గుర్తించడం కొంచెం కష్టమే. చెట్టుపై పక్షులు సేద తీరుతున్నట్లుగా ఉన్న ఆ ప్రదేశంలోనే ఈ విషసర్పం నక్కి ఉంది. ఇదొక చక్కటి బ్రెయిన్ టీజర్.. మీ కళ్లకు పవర్ ఉన్నట్లయితే ఈజీగా కనిపెట్టొచ్చు. లేదంటే కనిపెట్టడానికి టైం పడుతుంది. చాలామంది ఈ పజిల్ సాల్వ్ చేయలేక బుర్ర పట్టుకున్నారు. మరి మీరూ ఓసారి ట్రై చేయండి. కనిపెడితే ఓకే.. లేదంటే సమాధానం కోసం కింద ఫోటో చూడండి..
Here is the answer.. pic.twitter.com/XpLKje1D8r
— telugufunworld (@telugufunworld) April 8, 2022