Watch Video: ఓరీ దేవుడో.. ఈ కేక్‌ తయారీ చూస్తే.. ఫస్ట్‌ బర్త్‌డేలో తిన్నది కూడా కక్కేస్తారు.. ఇక లైఫ్‌లో మళ్లీ ముట్టరు..

|

Mar 04, 2024 | 8:28 AM

వైరల్‌ వీడియోలో కేక్‌ తయారీ విధానాన్ని చూపించారు. ఇది బేకరీ షాపుల్లో సర్వసాధారణం. టీ బ్రేక్‌లో, ఇతర వస్తువుల కోసం కిరణ షాపుకి వెళ్లిన వారు, లేదంటే, స్నాక్‌ ఐటమ్‌గా ఇలాంటి కేక్‌ను ఎక్కువగా తింటుంటారు చాలా మంది. కానీ, ఇక్కడ తయారు చేసిన కేక్‌ విధానం చూస్తే మాత్రం మీరు ఇకపై దానివైపు కనీసం చూడను కూడా చూడరు.. ఎందుకంటే.. అంత దరిద్రంగా తయారు చేస్తున్నారు ఆ కేక్‌ను.

Watch Video: ఓరీ దేవుడో.. ఈ కేక్‌ తయారీ చూస్తే.. ఫస్ట్‌ బర్త్‌డేలో తిన్నది కూడా కక్కేస్తారు.. ఇక లైఫ్‌లో మళ్లీ ముట్టరు..
Cake Making In Unhygienic
Follow us on

ప్రతిరోజూ మనం సోషల్ మీడియాలో ఎన్నో రకాల వింత, కొత్త, విభిన్నమైన వీడియోలను చూస్తాము.. వాస్తవం ఏమిటంటే ఈ వీడియోలలో ఎక్కువ సంఖ్యలో ఫుడ్‌కు సంబంధించిన వీడియోలు ఉంటున్నాయి. ఆహారం అనేది ప్రజలకు ఎలాంటి పరిస్థితిలోనైనా ఆకర్షణీయంగా ఉంటుంది. కాబట్టి ఎన్ని ఫుడ్ వీడియోలు వచ్చినా చూసేవాళ్లకు కొరత ఉండదు అనడంలో సందేహం లేదు. అయితే సోషల్ మీడియాలో వచ్చే లేదంటే వైరల్ అయ్యే ఫుడ్ వీడియోలన్నీ ఎంజాయ్ చేయడానికి ఉద్దేశించినవి కావు. కొన్ని మనకు కొత్త సమాచారాన్ని, కొత్త అనుభవాలను అందించేవిగా ఉంటాయి. ప్రస్తుతం అలాంటిదే ఒక బేకరీలో కేక్‌ తయారీ విధానానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్‌ వీడియోలో కేక్‌ తయారీ విధానాన్ని చూపించారు. ఇది బేకరీ షాపుల్లో సర్వసాధారణం. టీ బ్రేక్‌లో, ఇతర వస్తువుల కోసం కిరణ షాపుకి వెళ్లిన వారు, లేదంటే, స్నాక్‌ ఐటమ్‌గా ఇలాంటి కేక్‌ను ఎక్కువగా తింటుంటారు చాలా మంది. కానీ, ఇక్కడ తయారు చేసిన కేక్‌ విధానం చూస్తే మాత్రం మీరు ఇకపై దానివైపు కనీసం చూడను కూడా చూడరు.. ఎందుకంటే.. అంత దరిద్రంగా తయారు చేస్తున్నారు ఆ కేక్‌ను. పూర్తి అపరిశుభ్రమైన పరిస్థితుల్లో కేక్‌ తయారు చేయటం చూస్తుంటే.. కడుపులో దేవేస్తుంది. వైరల్‌ వీడియో చూస్తే మీరు కూడా ఇదే అంటారు..

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం కనిపించిన వీడియో ఆధారంగా.. ఇది ఒక పారిశ్రామిక ప్రాతిపదికన కేక్‌లను తయారు చేసే చిన్న ఫ్యాక్టరీని వీడియో చూపిస్తుంది. ఇక్కడ అపరిశుభ్ర వాతావరణంలో కేక్ తయారు చేయడమే కాకుండా.. కేక్ తయారు చేస్తున్న కార్మికులు పలుమార్లు కేక్ పిండిలో చేతులు ముంచడం వీడియోలో కనిపిస్తోంది. ఇది ఖచ్చితంగా చూడడానికి కలవరపెట్టే దృశ్యం. షాపుల నుంచి కొనే కేక్‌లను ఇలా తయారు చేస్తారా అనుకుంటూ చాలా మంది వీడియో కింద కామెంట్‌గా ప్రశ్న వేశారు.

ఇలాంటి అపరిశుభ్ర ఆహారం తయారు చేసే వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, అయితే, ఫుడ్‌ తయారీకి సంబంధించిన ప్రదేశాల్లో ఎలాంటి పర్యవేక్షణ జరగడం లేదనడానికి ఇదే నిదర్శనమని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..