Viral: పునాదుల కోసం తవ్వకాలు జరుపుతుండగా భారీ శబ్దం.. ఏంటని చూడగా అరుదైన అద్భుతం.!

|

Aug 13, 2022 | 1:54 PM

అది 20 అంతస్తుల ఆఫీస్ కోసం కేటాయించిన స్థలం. పునాదుల కోసం తవ్వకాలు జరుపుతున్నారు. ఈలోపు వారికి ఓ పెద్ద శబ్దం వినిపించింది.

Viral: పునాదుల కోసం తవ్వకాలు జరుపుతుండగా భారీ శబ్దం.. ఏంటని చూడగా అరుదైన అద్భుతం.!
Viral
Follow us on

అది 20 అంతస్తుల ఆఫీస్ కోసం కేటాయించిన స్థలం. పునాదుల కోసం తవ్వకాలు జరుపుతున్నారు. ఈలోపు వారికి ఓ పెద్ద శబ్దం వినిపించింది. ఏదో రాయి అయ్యి ఉంటుందిలే అనుకుని.. పని కంటిన్యూ చేశారు. కాని తవ్వుతున్న కొద్దీ ఆ శబ్దం భారీగా పెరుగుతోంది. ఏమై ఉంటుంది అనుకుని చూడగా అరుదైన అద్భుతం బయటపడింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగింది.

శతాబ్ద కాలంగా మెల్‌బోర్న్ నగర వీధుల్లో పాతిపెట్టబడిన ఓ స్లమ్ ఏరియా ఇటీవల బయటపడింది. దీనిని బెన్నెట్స్ లేన్ అనే రియల్ ఎస్టేట్ డెవలపర్స్ సంస్థ కనుగొనగా.. బయటపడిన ఆ అద్భుతమైన సైట్ 1913లో నేలమట్టం చేయబడిందని తెలుస్తోంది. అక్కడ ఉన్న గోడలు, నిప్పుగూళ్లు, మెట్లు మట్టిలోకి దిగుతుండగా.. వాటిల్లో చాలావరకు చెక్కుచెదరకపోవడం గమనార్హం.

ఇదిలా ఉంటే.. ఆ సైట్‌ను అక్కడ స్థానికంగా ఉండే పెర్రీ ప్రాజెక్ట్స్ డెవలపర్స్, పెల్లికానో 2017లో కొనుగోలు చేశారు. ఇక ఆఫీస్ నిర్మాణానికి ముందుగా పురావస్తు శాఖ పలు తవ్వకాలు జరిపింది. వారికి ఈ నేలమట్టం అయిన నగరంతో పాటుగా పొగాకు గొట్టాలు, టీ సెట్‌లు, డొమినోలు, సిరామిక్ బొమ్మలు, నాణేలు లభ్యమయ్యాయి. ఆ ప్రాంతమంతటా తరచుగా వరదలు వచ్చాయని.. అందుకే ఆ సమయంలో మెల్‌బోర్న్ నగర అధికారులు.. పాడుబడ్డ ఆస్తులను కూల్చివేయాలని ఆదేశించారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

 

కాగా, ప్రస్తుతం ఆ సైట్‌లో తవ్వకాలు 2 మీటర్లు లోతుగా సాగాయని.. మొదట అక్కడ ఇటుక గిడ్డంగులను బయటపడగా.. ఆ తర్వాత స్లమ్ ఏరియా, 19వ శతాబ్దపు టెర్రేస్ గృహాల అవశేషాలను, 1840లో నిర్మించిన చిన్న కుటీరాలను వెలికితీశామని చెప్పుకొచ్చారు. ఇంకా లోతుగా తవ్వితే.. మరిన్ని అరుదైన అద్భుతాలు బయటపడవచ్చునని పెర్రీ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ చెప్పుకొచ్చారు.

 

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..