AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గేదె యజమాని ఎవరు? తేల్చేందుకు డీఎన్‌ఏ పరీక్ష

బిహార్‌ గయా జిల్లాలో గేదె యాజమాన్య వివాదం డీఎన్‌ఏ పరీక్ష దాకా వెళ్లింది. సూరజ్‌ యాదవ్‌, ప్రకాశ్‌ మాంఝీ ఇద్దరూ గేదె తమదేనని పోలీసులను ఆశ్రయించారు. వివాదం పరిష్కారం కాకపోవడంతో మగధ్‌ రేంజ్‌ ఐజీ వికాస్‌ వైభవ్‌ డీఎన్‌ఏ పరీక్షకు ఆదేశించారు. పరీక్ష పూర్తయ్యే వరకు గేదెను పోలీసుల అధీనంలో ఉంచాలని సూచించారు.

గేదె యజమాని ఎవరు? తేల్చేందుకు డీఎన్‌ఏ పరీక్ష
Buffalo Dna Test
SN Pasha
|

Updated on: Aug 27, 2026 | 7:19 AM

Share

బిహార్‌లో ఓ గేదె యాజమాన్య వివాదం పోలీస్‌స్టేషన్‌కు చేరి, చివరకు డీఎన్‌ఏ పరీక్ష దాకా వెళ్లింది. గయా జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గేదె అసలు యజమాని ఎవరో నిర్ధారించేందుకు మగధ్‌ రేంజ్‌ ఐజీ వికాస్‌ వైభవ్‌ డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గయా జిల్లాలోని అతరీ పోలీస్‌స్టేషన్‌ పరిధికి చెందిన సూరజ్‌ యాదవ్‌కు చెందిన గేదె కొద్దిరోజుల క్రితం కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో సూరజ్‌ ఆందోళన చెందాడు. ఈ క్రమంలో నౌరంగా టోలీలోని ప్రకాశ్‌ మాంఝీ తన ఇంటి వద్ద ఓ గేదెను కట్టేసి ఉంచారనే సమాచారం అతడికి తెలిసింది.

దీంతో సూరజ్‌ అక్కడికి వెళ్లి ఆ గేదె తనదేనని పేర్కొన్నాడు. అయితే ప్రకాశ్‌ మాంఝీ కూడా గేదె తనదేనంటూ చెప్పడంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. విషయం పోలీస్‌స్టేషన్‌కు చేరింది. ఇద్దరూ గేదెపై తమకే హక్కు ఉందంటూ వాదించడంతో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఎవరికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలో స్పష్టత రాకపోవడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.

దీంతో మగధ్‌ రేంజ్‌ ఐజీ వికాస్‌ వైభవ్‌ గేదెకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని ఆదేశించారు. పరీక్ష పూర్తయ్యే వరకు గేదెను పోలీసుల అధీనంలోనే ఉంచాలని ఎస్పీకి సూచించారు. గేదె తల్లిదండ్రుల సంబంధాన్ని డీఎన్‌ఏ పరీక్ష ద్వారా ధ్రువీకరించి, యాజమాన్యాన్ని నిర్ధారించే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. దీంతో ఈ విచిత్ర వివాదానికి శాస్త్రీయ ఆధారాలతో పరిష్కారం లభించనుంది.

Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా