
మనం భగవంతుడి స్వరూపంగా భావించి పూజించే ఈ ప్రకృతిలో అనేక అద్భుతాలు జరుగుతాయి. కొన్ని సహజ అద్భుతాలు అయితే, మరికొన్ని సైన్స్, టెక్నాలజీ, వైద్య రంగాలకు కూడా సవాళ్లను కలిగిస్తాయి. మానవుడు ఎంత తెలివైనవాడైనా ఈ భూమిపై అతనికి తెలియని ఎన్నో నిగూఢమైన విషయాలు జరుగుతున్నాయి. అలాంటి కొన్ని అద్భుతాలను చూసి మనుషులు ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. కానీ వాటికి సమాధానాలు మాత్రం కనిపెట్టలేరు. ఇదంతా ఎందుకు చెబుతున్నారో మీరు ఆలోచిస్తున్నారా? పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్‌లో ఒక షాకింగ్ సంఘటన జరిగింది. అక్కడ ఒక గేదె గోధుమ రంగు దూడకు జన్మనిచ్చింది. అది గేదె కంటే ఆవులా కనిపిస్తుంది. ఈ వింత దృశ్యాన్ని చూసి గేదె యజమానితో సహా మొత్తం గ్రామం ఆశ్చర్యపోతుంది. గేదెలు ముదురు నలుపు రంగులో ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయమే. దూడ పుట్టినప్పుడు దాని రంగు కూడా నల్లగా ఉంటుంది. కానీ, ఈ దూడ రంగు మాత్రం చాలా భిన్నంగా ఉంది.. ఇది గోధుమ రంగులో ఉండి ఆవులా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాత్రి సమయంలో గేదె ప్రసవించినప్పుడు దాని రంగు పెద్దగా తెలియదని, అందుకే ఎవరూ అంత ఆశ్చర్యపోలేదని ఆ గేదె యజమాని అన్నారు. కానీ ఉదయం ఆ దూడను చూసినప్పుడు, అందరూ షాక్ అయ్యారు. ఆవులా కనిపించే దూడను చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఈ వింత సంఘటనను చూసేందుకు చుట్టు పక్కల గ్రామస్తులు కూడా క్యూ కట్టారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి