Wild Life Video: సాధారణంగా సింహానికి ఆకలేస్తే.. ఆ రోజు అడవిలో ఏదో ఒక జంతువుకు నూకలు చెల్లినట్లే. మాంచి ఆకలిమీదున్న సింహానికి ఎర దొరికితే ఏమాత్రం వదిలిపెట్టకుండా వేటాడి తినేస్తుంది. అందుకే.. సింహం కంటపడితే చాలు మిగతా జంతువులు ఎక్కడికక్కడ పరార్ అవుతాయి. సింహం గర్జన వినిపించిన గజ్జున వణికిపోతాయి. అందుకే సింహాన్ని మృగరాజు అంటారు. అయితే, అంతటి సింహానికి కూడా సుస్సు పోయింది ఓ అడవి దున్న. తనను వేటాడటానికి వచ్చిన మృగరాజును రివర్స్ పంచ్ ఇచ్చి.. బతుకు జీవుడా అని సింహమే పరుగులు తీసేలా చేసింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మాంచి ఆకలిమీదున్న సింహం.. అడవిలోని మైదాన ప్రాంతంలో మేత మేస్తున్న అడవి దున్నలను గమనించింది. వెంటనే దున్నపై దాడి చేసేందుకు దూకింది సింహం. అయితే, ఆ దున్న రివర్స్ షాక్ ఇచ్చింది. తన వాడి కొమ్ములతో సింహంపై విరుచుకుపడింది. సింహంపై రివర్స్ అటాక్ చేసింది. ఊహించని ఈ పరిణామంతో బిత్తరపోయింది మృగరాజు. దున్న నుంచి తప్పించుకునేందుకు పరగులు తీసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సింహాన్నే పరుగెత్తించిన దున్న ధైర్యానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేయగా.. దానికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంది. నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం ఈ షాకింగ్ వీడియోను మీరూ చూసేయండి.
Also read:
Leopard vs Phone: ఫోన్ కాపాడిన ప్రాణం.. దెబ్బకు పరుగులు తీసిన చిరుతపులి.. పూర్తివివరాలివే..!
Viral News: మహిళపై విరుచుకుపడుతున్న నెటిజన్లు.. కారణం ఏంటో తెలిస్తే ప్యూజులు ఎగిరిపోతాయి..!