అవసరమా..? రీల్స్‌ పిచ్చితో రిస్క్‌ చేశాడు.. అమాంతంగా జారిపడి ప్రాణాలు కోల్పోయాడు..

|

Oct 16, 2024 | 11:52 AM

రాత్రికి రాత్రే స్టార్స్‌ అయిపోవాలని ఆరాటపడుతున్నారు. ఇందుకోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఎక్కడున్నాం.. ఏం చేస్తున్నాం..? అవేవీ కూడా పట్టించుకోకుండా ప్రాణాలకు తెగించి ప్రమాదకర స్టంట్స్‌ చేస్తున్నారు. ఇక్కడ కూడా అదే జరిగింది. సోషల్‌ మీడియాలో వ్యూస్‌, లైక్స్‌ కోసం అత్యంత ఎత్తైన వంతెనను ఎక్కేందుకు ప్రయత్నించి..

అవసరమా..? రీల్స్‌ పిచ్చితో రిస్క్‌ చేశాడు.. అమాంతంగా జారిపడి ప్రాణాలు కోల్పోయాడు..
Highest Bridge
Follow us on

ఇంటర్‌నెట్‌ వినియోగం ప్రతి మూలన విస్తరించింది. దీంతో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. అంతేకాదు..సోషల్ మీడియాలో ఫేమస్‌ అవ్వాలనే కోరిక కూడా ప్రతి ఒక్కరిలోనూ విపరీతంగా పెరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే..ప్రస్తుత సమాజంలో రీల్స్‌ ట్రెండ్‌ నడుస్తోంది. చిన్న పెద్ద అనే తేడా లేదు..రాత్రికి రాత్రే స్టార్స్‌ అయిపోవాలని ఆరాటపడుతున్నారు. ఇందుకోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఎక్కడున్నాం.. ఏం చేస్తున్నాం..? అవేవీ కూడా పట్టించుకోకుండా ప్రాణాలకు తెగించి ప్రమాదకర స్టంట్స్‌ చేస్తున్నారు. ఇక్కడ కూడా అదే జరిగింది. సోషల్‌ మీడియాలో వ్యూస్‌, లైక్స్‌ కోసం అత్యంత ఎత్తైన వంతెనను ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

బ్రిటన్‌కు చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్‌ సాహసోపేత స్టంట్‌ చేసి ప్రాణం పోగొట్టుకున్నాడు. స్పెయిన్‌లోని అత్యంత ఎత్తైన వంతెనను ఎక్కేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకోగా.. ఇప్పుడు ఆలస్యంగా బయటపడింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రిటన్‌కు చెందిన సదరు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ (26) స్పెయిన్‌లోని అత్యంత పొడవైన తలావెరా డి లా రీనాలోని కాస్టిల్లా-లా కేబుల్‌ బ్రిడ్జ్‌ ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పట్టుకోల్పోయి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. కాగా, ఈ వంతెన ఎక్కడంపై నిషేధం ఉందని స్థానిక అధికారులు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వంతెనపైకి పర్యాటకుల్ని అనుమతించడం లేదని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..