అగ్గిపెట్టె లాంటి ఇల్లు వేలంలో కోట్లు పలుకుతోంది..! కారణం ఏంటో తెలుసా..?

Britains Tiny House: ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి స్థిరాస్తిపై పెట్టుబడి పెడుతారు. ఆస్తిపై పెట్టుబడులు పెట్టి

అగ్గిపెట్టె లాంటి ఇల్లు వేలంలో కోట్లు పలుకుతోంది..! కారణం ఏంటో తెలుసా..?
Britains Tiny House

Edited By: Ravi Kiran

Updated on: Dec 24, 2021 | 6:55 AM

Britains Tiny House: ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి స్థిరాస్తిపై పెట్టుబడి పెడుతారు. ఆస్తిపై పెట్టుబడులు పెట్టి తమ డబ్బును పొదుపు చేసుకుంటారు. అది కాలక్రమేణా విలువైనదిగా మారుతుంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక వింత ఇల్లు వైరల్‌ అవుతోంది. ఇలాంటి ప్రాపర్టీని ఎవరూ ఉచితంగా తీసుకోవడానికి కూడా ఇష్టపడరు అలాంటిది ఇప్పుడు ఆ ఇల్లు వేలంలో కోట్లు పలుకుతోంది. ఈ ఇల్లు బ్రిటన్‌లోని అతి చిన్న ఇల్లు. ప్రజలు ఈ ఇంటిని అగ్గిపెట్టెతో పోలుస్తారు. ఇప్పుడు ఈ ఇల్లు కోట్లకు అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉంది. కారణం ఏంటో తెలుసుకుందాం.

రిపోర్టు ప్రకారం.. ఒక రాయల్ అతిథులు దశాబ్దాలుగా ఈ ఇంటిని సందర్శిస్తున్నారు. ఆ తర్వాత దీని ధర దాదాపు మూడు కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. ఇప్పుడు దాని ఇంటీరియర్ గురించి మాట్లాడుకుంటే దాని బేస్మెంట్లో వంటగది ఉంటుంది. దీంతో పాటు అందమైన బాత్‌రూమ్‌ను కూడా నిర్మించారు. ఈ ఇంటిని చూసిన ప్రజలు చాలా ఆశ్చర్యపోతున్నారు. ఈ చిన్న గేట్‌హౌస్ నార్త్ యార్క్‌షైర్‌లోని గ్రిమ్‌స్టోన్ పార్క్ ఎస్టేట్‌లో నిర్మించారు. నివేదికల ప్రకారం 19వ శతాబ్దం నుంచి ఇక్కడ రాజవంశీయులు నివసించారని చెబుతారు. దీని చరిత్ర నిజంగా అద్భుతమైనది. ఈ చరిత్ర కారణంగా దీని ధర కోట్లలో పలుకుతోంది.

దీని ప్రస్తుత యజమాని చాలా సంవత్సరాలుగా ఈ ఇంట్లో నివసిస్తున్నాడు ఇప్పుడు అతడు దానిని విక్రయించే మూడ్‌లో ఉన్నాడు. ఇంటీరియర్ గురించి చెప్పాలంటే ఈ ఇల్లు 10 అడుగుల 5 అంగుళాలు 8 అడుగుల 6 అంగుళాలు. ఇంత చిన్న స్థలంలో చాలా బాగా డిజైన్ చేయడంతోపాటు ఎన్నో సౌకర్యాలు ఉండడం గమనించవచ్చు. బాత్రూమ్, కిచెన్ కాకుండా ఇతర గదులు కూడా ఉన్నాయి. ఈ ఇల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజలు ఈ ఇంటి చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. దీనిపై కామెంట్లు చేస్తున్నారు.

PM Modi: వినియోగదారులకు ప్రధాని మోడీ శుభవార్త.. సహకార డెయిరీ, పాల ఉత్పత్తుల కోసం ప్రత్యేక పోర్టల్..

RBI: జనవరి 1 నుంచి ఆర్‌బీఐ కొత్త రూల్స్‌ అమలు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

Viral Video: ఈ భారతీయుడి డ్యాన్స్‌ చూస్తే ప్రభుదేవా కూడా ఫిదా అవుతాడు..!