Wedding Video: ఇదేందిరయ్యా.. పెళ్లి మండపంలోనే పొట్టుపొట్టుగా కొట్టుకున్న వధూవరులు.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే

వరమాల సమయంలో వధూవరులు ఒకరితో ఒకరు గొడవపడడం ఇందులో మనం చూడవచ్చు. గొడవ అంటే అలాంటి ఇలాంటి గొడవ కాదు. ఒకరిని ఒకరు పొట్టుపొట్టుగా కొట్టుకుంటారు. చివరికి పెళ్లి మండపం కాస్తా ఒక యుద్ధభూమిలా మారిపోతుంది.

Wedding Video: ఇదేందిరయ్యా.. పెళ్లి మండపంలోనే పొట్టుపొట్టుగా కొట్టుకున్న వధూవరులు.. వీడియో చూస్తే అవాక్కవ్వాల్సిందే
Wedding

Updated on: Oct 10, 2022 | 8:57 AM

ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్‌ కాకపోయినా.. వధూవరులకు సంబంధించిన వేలాది వీడియోలు సోషల్‌మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఇందులో కొన్ని ఆశ్చర్యకరంగా ఉంటే మరికొన్ని ఫన్నీగా ఉంటున్నాయి. నెటిజన్లకు నవ్వును తెప్పిస్తున్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో బాగా వైరలవుతోంది. దీనిని చూసిన వారందరూ అవాక్కవుతున్నారు. వరమాల సమయంలో వధూవరులు ఒకరితో ఒకరు గొడవపడడం ఇందులో మనం చూడవచ్చు. గొడవ అంటే అలాంటి ఇలాంటి గొడవ కాదు. ఒకరిని ఒకరు పొట్టుపొట్టుగా కొట్టుకుంటారు. చివరికి పెళ్లి మండపం కాస్తా ఒక యుద్ధభూమిలా మారిపోతుంది. వైరల్‌ అవుతోన్న ఈ వీడియోలో వధూవరులు మొదట నిల్చోని ఉంటారు. సాంప్రదాయం ప్రకారం వరుడు తన కాబోయే వధువుకు స్వీట్లు తినిపిస్తాడు. అయితే పెళ్లి కూతురు కాస్తా సిగ్గుపడుతుంది. మొహం తిప్పుకుంటుంది. ఈ సమయంలో కెమెరాలన్నీ తమ వైపే ఉండడంతో వరుడికి ఆగ్రహం వస్తుంది. దీంతో వధువుకి ఇష్టం లేకపోయినా మిఠాయిని ఆమె నోట్లో బలవంతంగా కుక్కుతాడు. ఆతర్వాత వంతు పెళ్లికూతురుది. ఈసారి స్వీటు ముక్కను వరుడికి తినిపించేందుకు ప్రయత్నిస్తుంది వధువు. అయితే వరుడు ఆమెను పట్టించుకోడు. తనను కాకుండా పక్కకు చూస్తున్నప్పుడు ఆమె కూడా అతని నోట్లో మిఠాయిని కుక్కుతుంది.

యుద్ధభూమిగా పెళ్లి మండపం..

దీంతో వరుడికి ఎక్కడిలేని కోపం వస్తుంది. వధువును చెంపదెబ్బ కొడతాడు. తానేం తక్కువ తిన్నానంటూ పెళ్లికూతురు కూడా వరుడిని లాగి పెట్టి కొడుతుంది. ఇలా ఒకరికొకరు పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు. దూరంగా నెట్టుకున్నారు చుట్టూ ఉన్న స్నేహితులు, బంధువులు కూడా వారిని విడిపించేందుకు ప్రయత్నం చేయరు. దీంతో జయమాల కార్యక్రమం కాస్తా యుద్ధభూమిగా మారిపోతుంది. ఈ వీడియోను తారిక్ ఫతే అనే ట్విట్టర్‌ యూజర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఇప్పటివరకు ఈ వీడియోకు 1.5 లక్షల వ్యూస్‌ వచ్చాయి. అలాగే వేలాది లైకులు, కామెంట్లు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

పెళ్లి రోజునే గొడవకు దిగారంటే వారి బంధం ఎక్కువ రోజులు నిలవదని ఒకరు స్పందిస్తే.. ప్పుడే ఇలా ఉన్నారు.. వైవాహిక జీవితంలో ఎలా ఉంటారోనంటూ ఒకరు పేర్కొనగా.. బహుశా ఇద్దరికి పెళ్లి ఇష్టం లేదేమోనంటూ మరొకరు కామెంట్‌ పెట్టారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us