Viral Video: పెళ్లి మండపంలో వధువుతో వరుడు సరసాలు.. వీడియో చూస్తే ఫిదా కావాల్సిందే.!

| Edited By: Anil kumar poka

Sep 04, 2021 | 8:33 PM

పెళ్లంటేనే నూరేళ్ల పంట. బంధువులు, స్నేహితులు నవ వధూవరులను ఆటపట్టించడం.. మరీ ముఖ్యంగా వధువు తరపున బంధువులు.. వరుడికి..

Viral Video: పెళ్లి మండపంలో వధువుతో వరుడు సరసాలు.. వీడియో చూస్తే ఫిదా కావాల్సిందే.!
Marriage
Follow us on

పెళ్లంటేనే నూరేళ్ల పంట. బంధువులు, స్నేహితులు నవ వధూవరులను ఆటపట్టించడం.. మరీ ముఖ్యంగా వధువు తరపున బంధువులు.. వరుడికి సంబంధించిన వస్తువులు దాచిపెడుతూ కాసేపు ఫన్ క్రియేట్ చేస్తుంటారు. ఇలా పెళ్లిలో ప్రతీ మూమెంట్ అద్భుతంగా ఉంటుంది.
ఇదిలా ఉంటే వివాహం కొత్త జీవితానికి నాంది పలుకుతుంది. ప్రతీ ఒక్కరూ తమ వివాహ మహోత్సవాన్ని గుర్తుండిపోయే విధంగా ఓ అందమైన జ్ఞాపకంగా మలుచుకుంటారు. ప్రతీ మూమెంట్‌ను తమ కెమెరాల్లో క్యాప్చర్ చేసుకుంటారు. తాజాగా అలాంటి ఓ స్వీట్ మూమెంట్ ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. సాధారణంగా పెళ్లి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా పెళ్లికొచ్చిన స్నేహితులు ఇచ్చే ఫన్నీ టాస్క్‌లు, వధూవరుల అల్లరి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇలాంటి కోవకు చెందిన ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం..

పెళ్లి మండపంపై వధూవరులు కూర్చుని ఉన్నారు. బహుశా కార్యక్రమం పూర్తయినట్లు ఉంది. ఇద్దరూ కూడా ఆ పక్కనే ఉన్న అరటిపళ్ల గెల నుంచి ఒక్కో పండు తీసుకుని చక్కా ఆరగిస్తున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. పెళ్లికూతురు తన ఆకలిని తీర్చుకునేందుకు అరటిగెల నుంచి పండు తీసుకుంటుండగా.. ఆమె చేతుల్లో నుంచి ఆ పండును వరుడు తీసుకుని ఇంచక్కా లాగిస్తున్నాడు. ఒకసారి కాదు.. ఆమె తీసుకున్న రెండుసార్లు.. వరుడే అరటిపండ్లను తిన్నాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వధూవరుల సరసాలు, చిలిపి చేష్టలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దీనిపై వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

Read Also: ఒక్క వికెట్‌ కోసం తండ్లాట..! బ్యాట్స్‌మెన్‌ను చుట్టుముట్టిన ఫీల్డర్లు.. చివరికి గెలిచిందెవరు..?

హీరో కృష్ణుడు అరెస్ట్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు

డయాబెటిస్‌కు చెక్ పెట్టే అద్భుత ఫలం.. ఈ పండులోని స్పెషాలిటీ ఏంటో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

మద్యం మత్తులో యువతి హల్‌చల్.. కిక్కు ఎక్కువై రోడ్డుపై ఏం చేసిందో మీరే చూడండి..