AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కొత్త జంటకు ఫ్రెండ్స్ వింత బహుమతులు.. ఫన్నీ వీడియోపై మీరు కూడా ఓ లుక్ వేయండి మరి

Viral Video: పెళ్లంటే పందిళ్లు, తప్పెట్లు , తాళాలు తలంబ్రాలు, మూడు ముళ్ళు ఏడు అడుగులు.. మొత్తం కలిసి నూరేళ్లు.  అయితే  ఈ పెళ్లి వేడుక జీవితాంతం గుర్తిండిపోయేలా చేసేది.. మాత్రం కుటుంబ సభ్యులు..

Viral Video: కొత్త జంటకు ఫ్రెండ్స్ వింత బహుమతులు.. ఫన్నీ వీడియోపై మీరు కూడా ఓ లుక్ వేయండి మరి
Wedding Varal Video
Surya Kala
|

Updated on: May 07, 2022 | 11:49 AM

Share

Viral Video: పెళ్లంటే పందిళ్లు, తప్పెట్లు , తాళాలు తలంబ్రాలు, మూడు ముళ్ళు ఏడు అడుగులు.. మొత్తం కలిసి నూరేళ్లు.  అయితే  ఈ పెళ్లి వేడుక జీవితాంతం గుర్తిండిపోయేలా చేసేది.. మాత్రం కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు కలిసి చేసే సందడి. పెళ్లిళ్లలో వధూవరుల స్నేహితుల సరదాలు వేరే స్థాయిలో ఉంటాయి. వధూవరులకు తమ శుభాకాంక్షలను తెలియజేయడంతో పాటు.. వివాహం సందర్భంగా ఆ కొత్త జంటకు ఇచ్చే బహుమతులు కూడా వెరీ వెరీ స్పెషల్ అనిపిస్తాయి. తాజాగా పెళ్ళికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో(Social Media) హల్ చల్ చేస్తోంది. ఇందులో  వరుడి స్నేహితులు వేదికపై అతనికి ప్రత్యేకమైన బహుమతులు ఇచ్చారు. ఆ గిఫ్ట్స్ చూసిన ఆహుతులు, అతిధులు నవ్వులే నవ్వులు.

వివాహం జరిగిన అనంతరం వధూవరులను ఆశీర్వదించి వారికీ తమ స్థాయికి తగినట్లు బహుమతులను బంధువులు, స్నేహితులు అందిస్తారు. కొత్త జంటలో ఫోటోలు దిగి.. ఈ సందర్భాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. అయితే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో వధూవరులకు స్నేహితులు ఇచ్చిన గిఫ్ట్స్ చూసి వధూవరులతో పాటు అతిథులు కూడా నవ్వుకున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో.. వధూవరులు వేదికపై నిలబడి ఉన్నారు. కొత్త జంట దగ్గరకు స్నేహితుల వస్తుంటే..  నా మనసు పిచ్చిది కాదు అంటూ ఓ హిందీ సాంగ్ ప్లే అవుతుంది. ఒక ఫ్రెండ్ డ్యాన్స్ చేసి అనంతరం వరుడికి ఒక ప్లాస్టిక్ బకెట్ ను గిఫ్ట్ గా అందించాడు. ఈ గిఫ్ట్ చూసి వధూవరులు నవ్వుకున్నారు. ఇలా ఒకరి తర్వాత మరొకరు.. కొత్త జంట దగ్గరకు వచ్చి మగ్ , చేట, చీపురు ఇలా రకరకాల వింత బహుమతులు ఇచ్చారు.

వీడియో చూడండి:

ఈ వీడియోను డా. అజిత్ వర్వాంద్కర్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. అంతేకాదు వీడియోకి ‘ఇంతకంటే మంచి పెళ్లి బహుమతిని ఏ స్నేహితుడూ ఇవ్వడు, వీడియో చూడటం సరదాగా ఉంది…ఫన్నీ క్యాప్షన్ తో ఇచ్చారు. ఈ వీడియోకి లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక స్నేహితుడు పెళ్ళి కానుకగా టెడ్డీ బేర్ ఇచ్చి ఉంటే, అది ఏ మూలలో పడి ఉండేది.. కానీ వీరు ఇచ్చిన గిఫ్ట్స్ మంచి యూజ్ ఫుల్ అంటూ కామెంట్ చేశారు. మరొకరు వరుడు ఒకప్పుడు ఎవరి వివాహంలోనైనా ఇలాంటి జోక్ చేసి ఉంటాడని, అందుకే ఇప్పుడు మిగతా స్నేహితులు ప్రతీకారం తీర్చుకున్నారంటూ ఫన్నీ కామెంట్ చేశాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: KGF actor: చిత్ర పరిశ్రమలో విషాదం.. కేజీఎఫ్ నటుడు కన్నుమూత..

Kapil Sharma Show: కపిల్ శర్మ షోలో కమల్ సందడి.. మీరు గొప్ప మానవత్వం ఉన్న వ్యక్తి అంటున్న కపిల్

అప్పుడు సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. శ్రీకాంత్
అప్పుడు సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. శ్రీకాంత్
ఏం రాత రాశావు దేవుడా.. మంటల్లో పిల్లలు.. తట్టుకోలేక భార్య..
ఏం రాత రాశావు దేవుడా.. మంటల్లో పిల్లలు.. తట్టుకోలేక భార్య..
బన్నీ సినిమాలో కొంచెం ఉంటే బూతు పాట అయిపోయేది..
బన్నీ సినిమాలో కొంచెం ఉంటే బూతు పాట అయిపోయేది..
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?