Viral Video: మండపంలోనే వరుడిని చాచిపెట్టి కొట్టిన వధువు.. స్వీట్ తినిపిస్తే .. సీన్ రివర్స్ అయ్యింది…

అలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అందులో వధువరులు ఇద్దరూ వరమాలలు వేసుకున్న తర్వాత స్వీట్స్ తినిపించుకున్నారు. అయితే సరదాగా మొదలైన వేడుక.. ఆ తర్వాత సీన్ మారింది.

Viral Video: మండపంలోనే వరుడిని చాచిపెట్టి కొట్టిన వధువు.. స్వీట్ తినిపిస్తే .. సీన్ రివర్స్ అయ్యింది...
Viral V

Updated on: Aug 15, 2022 | 5:41 PM

గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోస్ వైరల్ అవుతున్నాయి. అందులో వధువు, వరుడు సరదా ఆటలు.. బంధువులు, స్నేహితుల అల్లరి వీడియోస్ చూస్తుంటాము. అయితే కొన్ని సందర్భాల్లో వధువరుల మధ్య జరిగే సరదా ఆటలు అనుకోకుండా సీరియస్ అవుతాయి. అలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అందులో వధువరులు ఇద్దరూ వరమాలలు వేసుకున్న తర్వాత స్వీట్స్ తినిపించుకున్నారు. అయితే సరదాగా మొదలైన వేడుక.. ఆ తర్వాత సీన్ మారింది.

ఆ వీడియోలో మండపంలో వధువరులు ఇద్దరూ వరమాలలు మార్చుకున్న తర్వాత ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకుంటున్నారు. అయితే సరదాగా జరగాల్సిన ఈ వేడుకలో వారిద్దరు కోపంతో బలవంతంగా స్వీట్ తినిపించుకున్నారు. ముందుగా వధువు వరుడికి చిరాకుతో స్వీట్ బలవంతంగా తినిపించగా.. పెళ్లు కుమారుడు కూడా అంతే బలవంతంగా తినిపించేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహంతో వరుడిని చాచిపెట్టి కొట్టింది వధువు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us