AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఎంతకు తెగించార్రా..! బ్యాంక్ లోన్ కోసం శవంతో ఏం చేశారో చూడండి..!

ఇక్కడ ఓ మహిళ డెడ్ బాడీని షురిటీగా చూపించి అప్పు తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లింది.  బ్యాంకు కూడా ఆమె లోన్‌ అప్రూవ్‌ చేసింది. కానీ, పాపం పండింది అన్నట్టుగా.. మహిళ ఖాతాలోకి డబ్బులు వెళ్లకముందే ఆమె చేసిన మోసం బయటపడింది. పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈ షాకింగ్‌ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే...

Watch Video: ఎంతకు తెగించార్రా..! బ్యాంక్ లోన్ కోసం శవంతో ఏం చేశారో చూడండి..!
Dead Man On Wheelchair In B
Jyothi Gadda
|

Updated on: Apr 19, 2024 | 2:30 PM

Share

దురాశ దుఃఖానికి చేటు అని పెద్దలు చెప్పిన మాట మన చిన్నతనం నుంచి వింటూనే ఉన్నాం.. అత్యాశకు మృత దేహాలను వాడేసుకుంటున్నారు కొంతరు కంత్రీ కక్కుర్తి మనుషులు. ఇలాంటి ఉదంతం బ్రెజిల్‌లో వెలుగు చూసింది. ఇక్కడ ఓ మహిళ డెడ్ బాడీని షురిటీగా చూపించి అప్పు తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లింది.  బ్యాంకు కూడా ఆమె లోన్‌ అప్రూవ్‌ చేసింది. కానీ, పాపం పండింది అన్నట్టుగా.. మహిళ ఖాతాలోకి డబ్బులు వెళ్లకముందే ఆమె చేసిన మోసం బయటపడింది. పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈ షాకింగ్‌ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…

రియో డి జెనీరోలో ఒక మహిళ బ్యాంకు వచ్చింది. సదరు బ్యాంకు నుంచి 3 వేల డాలర్లు అంటే దాదాపు రూ. 2.50 లక్షల రుణం అప్లై చేసింది. లోన్‌ కోసం షురిటీ సంతకం అవసరం. అందుకు ఆ మహిళ చనిపోయిన వ్యక్తిని తన మామగా దత్తత తీసుకుని వీల్ చైర్‌లో బ్యాంకుకు తీసుకువచ్చింది.. ఓ పేపర్‌పై సంతకం చేసేందుకు చనిపోయిన వ్యక్తి చేతి వేళ్లలో పెన్ను పెట్టేందుకు మహిళ ప్రయత్నించడం వీడియోలో కనిపిస్తోంది. ఆ వ్యక్తి సజీవంగా ఉన్నాడని ప్రజలు భావించేలా ఆమె అతనితో ఏదో మాట్లాడుతున్నట్టుగా ప్రవర్తించింది. ఈ సమయంలో అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఈ మొత్తం ఘటనను వీడియో తీశాడు. ఎట్టకేలకు సదరు మహిళ చేసిన మోసం బట్టబయలు కావడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్‌ అవుతున్న వీడియోలో చనిపోయిన వ్యక్తిని సంతకం చేయమని మహిళ అడుగుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ సమయంలో వీల్ చైర్‌పై కూర్చున్న వ్యక్తికి ఆరోగ్యం బాగోలేదని బ్యాంకు ఉద్యోగితో చెప్పింది సదరు కిలేడీ. తన మామ చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని చెప్పింది. అందుకే అతని పరిస్థితి ఇలా ఉందని వారిని బురిడీ కొట్టించింది. కానీ, ఎట్టకేలకు దొరికిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!