ఫన్, క్రియేటివిటీకి సోషల్ మీడియాలో కొదవ ఉండదు. కంటెంట్ క్రియేటర్స్ ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో నెటిజన్ల ముందుకు వస్తున్నారు. ఒకరు మీమ్స్‌తో అలరిస్తుంటే.. మరొకరు ఫన్నీ వీడియోస్.. ఇంకొకరు ఫోటో పజిల్స్‌తో ఇంటర్నెట్‌లో రఫ్ఫాడిస్తున్నారు. పైవన్నీ పక్కన పెట్టి.. ఫోటో పజిల్స్‌పై ఓసారి చర్చకు దిగితే.. ఈ చిత్రాలు ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ సృష్టిస్తున్నాయి. వీటిల్లో దాగున్న రహస్యాలను కనుక్కోవడం అంత సులువు కాదు.. మీ కళ్ళను మోసం చేస్తుంటాయి. మెదడును తికమక పెడతాయి. అంతేకాదు కళ్లకు పదును పెడతాయి. తాజాగా ఈ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదేంటో చూసేద్దాం..
పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? ఏం కనిపిస్తోంది.. ఠక్కున ‘9’ నెంబర్స్ అని చాలామంది అంటారు. అయితే వాటి మధ్య ‘3’ నెంబర్స్ కూడా ఉన్నాయి. అవి ఎన్నో మీరు కనిపెట్టాలి. కష్టమైన పజిల్ కాదండోయ్.. చాలా ఈజీ.. నూటికి 99 మంది ఈ పజిల్ సాల్వ్ చేశారు. మరి మీరూ ఫోటోను పైపైన చూడకుండా నిశితంగా పరిశీలించండి. ఆన్సర్ ఈజీగా కనిపెట్టేయగలరు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..