Brain Teaser Puzzle with solution: బుర్రకు పదును పెట్టకపోతే తుప్పుపట్టే ప్రమాదం ఉంది. అందుకు బ్రెయిన్ టీజర్ పజిల్స్ చాలా బాగా పనిచేస్తాయి. పైగా ఆసక్తికరంగా కూడా ఉంటాయి. చూసేందుకు సులువుగా అనిపించినా పరిష్కరించడం మాత్రం చాలా తార్కిక జ్ఞానం అవసరం అవుతుంది. ఇలాంటి బ్రెయిన్ టీజర్‌లు మిమ్మల్ని ఆలోచింప చేయడమేకాకుండా మీలోని అన్ని సామర్థ్యాలకు పని చెబుతుంది. నిజానికి బ్రెయన్ టీజర్లు, పజిల్‌లు ఒకేలా కనిపించినా రెండు వేర్వేరు వైవిధ్యాల్లో ఉంటాయి. కొన్నింటికి మీలోని తార్కిక నైపుణ్యాలు ఉపయోగించాల్సి వస్తే.. మరికొన్నేమో సృజనాత్మక శక్తికి పనిచెబుతాయి. చిన్నపిల్లలు, పెద్దలు అందరూ ఖాళీ సమయాల్లో ఇలాంటి ఫజిల్స్ ప్రయత్నించవచ్చు. అప్పడప్పుడు ఫజిల్స్ ట్రై చేస్తూ ఉంటే మీ మెమరీ పవర్ షైన్ అవుతూ ఉంటుంది. మీకు సత్తా ఉంటే దీనిని కనుక్కోండి చూద్దం.. ఇక్కడ ఇచ్చిన పిక్చర్‌ను చూశారు కదా!
అగ్గిపుల్లలతో పేర్చిన 8+3-4=0 గణాంకాన్ని 30 సెకన్లలోపు కేవలం ఒక్క అగ్గిపుల్లను మాత్రమే కదిలించి సరిచెయ్యాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫజిల్ ట్రెండ్ అవుతోంది. చాలా మంది సమాధానం కనుక్కోవడంలో విఫలమయ్యారు. మీరూ సరదాగా ట్రై చేయండి.. ఆన్సర్ దొరుకుతుందేమో ప్రయత్నించండి..
సమాధానం దొరకలేదా. ఐతే కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వండి.. అవేంటంటే.. కేవలం ఒకేఒక్క అగ్గిపుల్లను కదిలించాలనేది కండీషన్. సమాధానం ఎప్పుడూ ఒకేలా రావాలనే నిబంధన ఏమీ లేదు. దీనికి మూడు రకాల ఆన్సర్లు ఇవ్వవచ్చు.
మొదటిది.. 8లోని అగ్గిపుల్లల్లో ఒకదాన్ని తీసివేసి 9గా చేసి, దానిని 0 మధ్యలో పెట్టి 8గా మార్చితే లెక్క సరిపోతుంది. అప్పడు 9+3-4= 8 వస్తుంది.
రెండవది.. మొదటి సంఖ్య 8లో ఒక అగ్గిపుల్లను తీసి, 6గా మార్చాలి. ఆ తర్వాత 4 పై భాగంలో దానిని ఉంచితే అది 9 అవుతుంది. ఇప్పుడు మొత్తం లెక్క చేయండి. కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అంటే 6+3-9=0 అవుతుంది. కింది ఇమేజ్ చూడండి
ఇక మూడవది.. ఇది ఇంకా సులువు. 4 లో నుంచి మధ్యలోనున్న అగ్గిపుల్లను తీసి మొదటి అగ్గిపుల్ల కింద పెడితే అప్పుడు 11 సంఖ్య వస్తుంది. అప్పుడు 8+3-11=0 అవుతుంది. అర్థం కాకపోతే కింద ఇచ్చిన ఇమేజ్ చూడండి.