Viral Video: ఆర్ఆర్ఆర్ పాటకు దుమ్మురేపిన యువకులు.. మట్టిలో దొర్లుతూ.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే..

|

May 08, 2022 | 8:02 PM

RRR మూవీ పాటలకు యువత తమదైన స్టైల్లో స్టెప్పులు వేస్తూ.. రామ్ చరణ్, ఎన్టీఆర్ లను అనుకరించడానికి ప్రయత్నిస్తున్నారు.

Viral Video: ఆర్ఆర్ఆర్ పాటకు దుమ్మురేపిన యువకులు.. మట్టిలో దొర్లుతూ.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే..
Viral Video
Follow us on

Boys dance on RRR hit song: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ (RRR) ఆర్ఆర్ఆర్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి జక్కన్న చెక్కిన ట్రిబుల్ ఆర్ విడుదలైన అన్ని దేశాల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా అదే రేంజ్‌లో కలెక్షన్లను కూడా రాబట్టింది. ఈ సినిమాలోని పాటలకు విపరీతమైన క్రేజ్ లభించింది. ముఖ్యంగా యువత ఈ పాటలకు బాగా కనెక్ట్ అయ్యారు. ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ పాటలు మార్మోగుతున్నాయి. ఈ పాటలకు యువత తమదైన స్టైల్లో స్టెప్పులు వేస్తూ.. రామ్ చరణ్, ఎన్టీఆర్ లను అనుకరించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ట్రిబులార్‌కు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఓ ఫన్నీ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

‘RRR’లోని నాటు నాటు సూపర్ డూపర్ సాంగ్.. హిందీలో ‘నాచో-నాచో’ గా రీమేక్ చేశారు. ఇది ఇప్పటికీ అభిమానులను ఊర్రుతలూగిస్తోంది. నాచో నాచో పాటకు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ తేజ స్క్రీన్‌పై అద్భుతంగా డ్యాన్స్ చేశారు. వారి సిగ్నేచర్ స్టెప్ ను కాపీ కొట్టి.. చాలామంది ఇప్పటికీ కొంతమంది నెట్టింట హల్‌చల్ చేస్తున్నారు. తాజాగా ఈ పాటకు డ్యాన్స్ చేస్తున్న కొందరు కుర్రాళ్ల వీడియో వైరల్ అవుతోంది. సిగ్నేచర్ స్టెప్ వేసే క్రమంలో వారంతా.. సడెన్ గా కింద బొర్లాడుతూ డ్యాన్స్ చేశారు. ఇది చూసిన వారంతా తెగ నవ్వుకుంటూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో..

‘నాచో-నాచో’ సాంగ్‌కు కొంతమంది అబ్బాయిలు డ్యాన్స్ చేస్తున్నారు. మొదట్లో డ్యాన్స్ మామూలుగానే సాగింది. యువకులంతా ఒక వృత్తంలో తిరుగుతూ నృత్యం చేస్తూ అకస్మాత్తుగా కింద పడుకొని స్టేప్పులేస్తారు. భుజాన్ని కదిలిస్తూ.. దాని సహాయంతో చుట్టూ తిరుగుతుంటారు. చివరకు ఒక యువకుడే ఈ స్టేప్పును పూర్తిగా వేస్తాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ‘gieddee’ షేర్ చేయగా.. నెటిజన్లు చూసి పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ డ్యాన్స్ ఏంటిరా నాయనా.. మతి పోతుంది.. అంటూ నవ్వుకుంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

Kidney Care Tips: కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఈ రసం తాగితే వెంటనే చెక్ పెట్టొచ్చు.. 

Health Tips: ఆహారం తిన్న వెంటనే నీరు తాగొచ్చా.. లేదా? అసలు ఎప్పుడు తాగితే మంచిదో తెలుసుకోండి..