ఏకాంతంగా ఉండాలని అక్కడికి వెళ్లిన లవర్స్‌.. ఆ తర్వాత సీన్‌ మారింది.. కట్‌ చేస్తే ఊరంతా అక్కడే..

ఈ ప్రపంచం కంటపడకుండా ఇద్దరూ ప్రేమికులు ఏకాంతంగా కలుసుకోవాలని భావించారు. ప్రజలకు దూరంగా ఉండేందుకు నర్మదా నది వద్దకు చేరుకున్నారు. ఎవరికీ కనిపించకుండా ఇసుక దిబ్బల్లో కూర్చుకుని ముచ్చటేస్తున్నారు. కానీ, అంతలోనే అక్కడ భారీగా జనం గుమిగూడారు. నది మధ్యలో ఉన్న ప్రేమికుల్ని చూసిన వందలాది ఆశ్చర్యపోయారు. అంతేకాదు.. ఆ ఇద్దరి సమావేశం ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో కూడా వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

ఏకాంతంగా ఉండాలని అక్కడికి వెళ్లిన లవర్స్‌.. ఆ తర్వాత సీన్‌ మారింది.. కట్‌ చేస్తే ఊరంతా అక్కడే..
Couple Trapped In Narmada

Updated on: Jun 24, 2025 | 12:22 PM

సోషల్ మీడియా ప్రపంచవ్యాప్తంగా ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఒక ప్రేమికుడు తన ప్రియురాలిని కలవడానికి ఎవరూ ఊహించని ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. అది వారిద్దరికీ ఇబ్బందులకు కారణమైంది. నిజంగా చెప్పాలంటే ఆ ప్రదేశం వారికి యమలోకంగా మారింది. ఇందుకు సంబందించిన వీడియో గుజరాత్‌లోని భరూచ్‌కు చెందినదని తెలిసింది. వీడియోలో ఒక యువకుడు తను ప్రేమించిన యువతిని నర్మదా నది దగ్గర కలవడానికి పిలిచాడు.ఆ తర్వాత ఏం జరిగిందో అంతా కెమెరాలో రికార్డయింది. ఇప్పుడు ఈ వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

వైరల్‌ వీడియోలో ఇద్దరు ప్రేమికులు నర్మదా నదిపై నిర్మించిన ఒక వంతెన ఎక్కి నిల్చున్నారు. అంతకు ముందు వారిద్దరూ ఏకాంతంగా గడిపేందుకు నది వద్దకు చేరుకున్నట్టుగా తెలిసింది. ఆ సమయంలో నది నీటి మట్టం తక్కువగా ఉండటంతో ఇద్దరూ నది మధ్యలో వెళ్లి ఇసుకలో కూర్చున్నారు. ఇద్దరూ మాటల్లో పడి నది నీటి మట్టం పెరగడాన్ని గమనించలేదు. చివరకు నదీ ప్రవాహం భారీగా పెరిగి ఒడ్డుకు తిరిగి రావడం అసాధ్యంగా మారింది.

ఇవి కూడా చదవండి

అలా నీటి సుడులలో చిక్కుకున్న ప్రేమికులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడి వంతెన పిల్లర్‌పై ఎక్కి నిలబడ్డారు. సహాయం కోసం గంటల తరబడి అక్కడే వేచి ఉండాల్సి వచ్చింది. ఉంది. ప్రపంచం కంటపడకుండా ఇద్దరూ ఏకాంతంగా, దూరంగా కలుసుకోవాలని భావించారు.. కానీ, కొద్దిసేపటికే, నది ఒడ్డున వందలాది మంది గుమిగూడారు. వారిద్దరూ నది మధ్యలో ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నది నీటి మట్టం ఇంకా పెరుగుతూనే ఉంది. దాంతో చేసేది లేక స్థానికుల సమాచారం మేరకు రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. వారిద్దరినీ పడవ సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ మొత్తం సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది.

వీడియో ఇక్కడ చూడండి…

ఈ వైరల్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో viral_news_here_ అనే హ్యాండిల్ నుండి షేర్ చేయగా, వీడియోపై నెటిజన్లు చాలా కామెంట్లు చేస్తున్నారు. చాలా మంది యూజర్లు దానిపై ఫన్నీ కామెంట్లు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..