Watch: వార్నీ బుడ్డొడు.. ఏడుస్తూనే ఎంతపని చేశాడు..! చూసే వాళ్లందరికీ చెమటలే..

ఇకతాను ఓడిపోతున్నానే బాధతో ఒక్కసారిగా ఏడుపు మొదలుపెట్టాడు. ఆట ఆడుతూనే ఏడుస్తున్నాడు.. చివరకు విన్నింగ్ షాట్ కొట్టి కన్నీటిని కాస్తా ఆనందభాష్పాలుగా మార్చేసుకున్నాడు. ఇదంతా చూసిన ప్రేక్షకులు సంతోషంతో చప్పట్లు కొడుతూ అతన్ని ప్రశంసించారు.

Watch: వార్నీ బుడ్డొడు.. ఏడుస్తూనే ఎంతపని చేశాడు..! చూసే వాళ్లందరికీ చెమటలే..
Boy Win Table Tennis

Updated on: Nov 11, 2024 | 11:48 AM

ఏ ఆటలో అయినా గెలుపు ఓటములు సహజం. కొందరు గెలుపును ఎంజాయ్‌ చేస్తారు. ఓడిన వారు ఓటమిని అంగీకరిస్తారు. కానీ, కొందరు మాత్రం ఓటమిని ఒప్పుకోలేరు. ముఖ్యంగా చిన్నపిల్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఓటమిని తట్టుకోలేక కొందరు పిల్లలు గగ్గొలుపెట్టి ఏడుస్తుంటారు. అలాంటి పనే చేశాడు ఇక్కడో బుడతడు. అవతలి వ్యక్తి చేతిలో తాను ఓడిపోతానని భయంతో ఆట మధ్యలోనే ఏడుపు మొదలుపెట్టాడు..కానీ, చివరకు ఏం జరిగిందో చూసి అక్కడున్న వారంతా బిత్తరపోవాల్సి వచ్చింది. ఎందుకంటే.. ఏడుస్తూనే ఆ బుడ్డొడు ఆటను గెలిచి చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో చాలా మంది పిల్లలు పాల్గొంటారు. అయితే, ఆటలో పాల్గొన్న ఇద్దరు పిల్లలు టేబుల్ టెన్నిస్ ఆడే క్రమంలో వారిలో ఓ బాలుడు బాగా ఆడుతూ ఎక్కువ స్కోర్ సాధిస్తాడు. అది చూసిన మరో బాలుడు తట్టుకోలేక పోయాడు. ఇకతాను ఓడిపోతున్నానే బాధతో ఒక్కసారిగా ఏడుపు మొదలుపెట్టాడు. ఆట ఆడుతూనే ఏడుస్తున్నాడు.. చివరకు విన్నింగ్ షాట్ కొట్టి కన్నీటిని కాస్తా ఆనందభాష్పాలుగా మార్చేసుకున్నాడు. ఇదంతా చూసిన ప్రేక్షకులు సంతోషంతో చప్పట్లు కొడుతూ అతన్ని ప్రశంసించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..