Boy Feeding Birds Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం పలు రకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ వీడియోల్లో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని హృదయాన్ని హత్తుకునే విధంగా ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఎక్కడైనా సరే పిల్లలను భగవంతుని రెండవ రూపంగా చూస్తారు. వారు ఏ పని చేసినా వారిలో భగవంతుని రూపమే కనిపిస్తుందంటారు. అయితే.. పిల్లలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియోను చూసి నెటిజన్లంతా ప్రేమంటే ఇదేనంటూ కితాబిస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ఒక చిన్న పిల్లవాడు పక్షులకు ఆహారాన్ని తినిపిస్తూ కనిపించాడు.
ఆకలితో ఉన్న వ్యక్తికి ఆహారం ఇవ్వడం చాలా పుణ్యంగా భావిస్తారు. అది మానవుడైనా.. జంతువు అయినా సాయం చేస్తే పుణ్యం వస్తుందని పేర్కొంటారు. చాలా మంది జంతుప్రేమికులు.. జంతువులు, పక్షులకు ఎప్పటికప్పుడు ఆహారం, నీరు అందిస్తుంటారు. అయితే వైరల్ అవుతున్న చిన్నారి వీడియోలో బుడ్డోడు పక్షులకు ఆహారం ఇస్తూ కనిపించాడు.పొలం గట్టుపై ఉన్న ఒక చిన్న పిల్లవాడు కూర్చుని.. పక్షులకు ఆహారం తినిపిస్తుంటాడు. అతని చేతిలో ఒక గిన్నె, ఓ కర్ర పుల్లను కూడా మీరు వీడియోలో చూడవచ్చు. పిల్లవాడి ముందు 3-4 పక్షులు కూర్చుని ఉన్నాయి. అతను ప్రేమగా వాటి నోటిలో ఆహారం వేస్తున్నాడు. ఈ అందమైన వీడియోను చూసి చాలా మంది నెటిజన్లు సంతోషం వ్యక్తంచేస్తూ.. బుడ్డోడిని ప్రశంసిస్తున్నారు.
వైరల్ వీడియో..
Kindness…
Teach kids to be kind. The world will be a different place to live pic.twitter.com/R3deWLjbPi— Susanta Nanda (@susantananda3) December 5, 2021
దీంతోపాటు చాలా మంది ఈ వీడియోపై పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. చాలా మంది పిల్లలు దయతో ప్రేమ స్వభావంతో ఉంటారని.. మనం ఎల్లప్పుడూ వారికి అదే నేర్పించాలంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ప్రపంచంలో జంతువులు, పక్షులు స్నేహితులే.. మనం కూడా వాటిని ప్రేమించాలంటూ మరో యూజర్ రాశారు.
Also Read: