Viral Video: విద్యుత్ వైర్లతో మృత్యువుతో ఆటడుతున్న యువకుడు.. షాకింగ్ వీడియో వైరల్..

|

May 25, 2024 | 7:03 PM

ఆ వీడియోలో ఓ కుర్రాడు విద్యుత్ తీగలతో మృత్యువు ఆటను ఆడుతూ చూపించాడు. అది చూసి జనం నోరెళ్లబెట్టారు. బాలుడు తన రెండు చేతుల్లో రెండు వైర్లను పట్టుకున్నాడు. వెంటనే ఆ వైర్లను తన నోటిలో పెట్టుకున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. దీని తర్వాత ఆ యువకుడు తన శరీరంలో కరెంట్ నడుస్తుందా లేదా అని పరీక్షించడం ప్రారంభించాడు. ఫలితం షాకింగ్‌గా ఉంటుంది. ఆ వ్యక్తి బాలుడి రెండు చేతులను టెస్టర్‌తో చూశాడు

Viral Video: విద్యుత్ వైర్లతో మృత్యువుతో ఆటడుతున్న యువకుడు.. షాకింగ్ వీడియో వైరల్..
Viral Video
Follow us on

గత కొన్ని ఏళ్ల క్రితం వరకూ అన్ని చోట్లా కరెంటు సౌకర్యం ఉండేది కాదు. ముఖ్యంగా గ్రామాల్లో దీపాలు లేదా లాంతర్ల సహాయంతో రాత్రంతా గడిపేవారు. అయితే ఇప్పుడు కరెంటు లేని గ్రామం కనిపించడం బహు అరుదు. ఈ విద్యుత్తు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపినప్పటికీ.. వాస్తవానికి ఇది చాలా ప్రమాదకరమైనది. విద్యుదాఘాతంతో ప్రజలు గాయపడడం లేదా మరణించడం వంటి సంఘటనలను మీరు చూసి ఉంటారు లేదా వింటారు. అయితే ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసి ప్రజలు షాక్ తిన్నారు.

ఆ వీడియోలో ఓ కుర్రాడు విద్యుత్ తీగలతో మృత్యువు ఆటను ఆడుతూ చూపించాడు. అది చూసి జనం నోరెళ్లబెట్టారు. బాలుడు తన రెండు చేతుల్లో రెండు వైర్లను పట్టుకున్నాడు. వెంటనే ఆ వైర్లను తన నోటిలో పెట్టుకున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. దీని తర్వాత ఆ యువకుడు తన శరీరంలో కరెంట్ నడుస్తుందా లేదా అని పరీక్షించడం ప్రారంభించాడు. ఫలితం షాకింగ్‌గా ఉంటుంది. ఆ వ్యక్తి బాలుడి రెండు చేతులను టెస్టర్‌తో చూశాడు. అప్పుడు ఆ బాలుడి శరీరంలో విద్యుత్ పారుతుందని.. అయినప్పటికీ ఆ యువకుడికి ఏమీ జరగదని రుజువైంది. ఈ దృశ్యం చూసిన వారికి ఎవరికైనా ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి

 

ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో rajumala88 అనే ఐడితో షేర్ చేయబడింది. ఇది ఇప్పటివరకు 2 లక్షల 30 వేల సార్లు వీక్షించబడింది, అయితే 7 వేల మందికి పైగా వీడియోను లైక్ చేసారు.

అదే సమయంలో వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇచ్చారు. ఒక యూజర్ ‘ఇలా ఆడుకోకు బ్రదర్, లైఫ్ చాలా విలువైనది’ అని రాస్తే, మరో యూజర్ ‘ఈ వ్యక్తి మృత్యువును తాకి చిటికెలో తిరిగి రాగలడు’ అని రాశాడు, మరికొందరు యూజర్లు కూడా ఇలా అంటున్నారు. రెండు వైర్లను ఒకే దశలో కనెక్ట్ చేసింది. అందుకే అతనికి విద్యుత్ రావడం లేదు.

 

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..