Viral Video: కరువు బ్యాచ్‌లా ఉన్నాడు.. దెయ్యానికే ఫ్లయింగ్ కిస్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే..
Viral Video: కళ్ల ముందు దెయ్య వంటి రూపం కనిపిస్తే ఎవైరా గజ్జున వణికిపోతారు. భయపడి అక్కడి నుంచి పరుగులు తీస్తారు. కానీ, ఇక్కడ ఓ యువకుడు మాత్రం భయ సంగతి దేవుడెరుగు.. ఏకంగా దెయ్యానికే ఫ్లయింగ్ కిస్ చేస్తూ ప్రపోజ్ చేశాడు.
Viral Video: కళ్ల ముందు దెయ్య వంటి రూపం కనిపిస్తే ఎవైరా గజ్జున వణికిపోతారు. భయపడి అక్కడి నుంచి పరుగులు తీస్తారు. కానీ, ఇక్కడ ఓ యువకుడు మాత్రం భయ సంగతి దేవుడెరుగు.. ఏకంగా దెయ్యానికే ఫ్లయింగ్ కిస్ చేస్తూ ప్రపోజ్ చేశాడు. యువకుడు ఇచ్చిన ట్విస్ట్‌కు ఆ దెయ్యం మూర్చ వచ్చి పడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో విజువల్స్.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అవును, మీరు చదివింది అక్షరాలా నిజం.
దెయ్యాల గురించి అనేక కథలు నానుడిలో ఉన్నాయి. దెయ్యాలు ఉన్నాయని కొందరు, లేవని మరికొందరు వాదిస్తూనే ఉంటారు. ఈ వాదనలు సమాజంలో నిత్యకృత్యాలే. అయితే, ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. ఎవరి నమ్మకాలు ఎలా ఉన్నా.. ఈ దెయ్యాలు బేస్ చేసుకుని అనేక సినిమాలు, కథలు, కథనాలు వస్తూనే ఉన్నాయి. వాటిని జనాలు స్వీకరిస్తూనే ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో దెయ్యం వేషాలతో ప్రాంక్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది. దెయ్యం వేషం వేసుకుని, రోడ్ల వెంబడి తిరుగుతూ జనాలను భయపెడుతున్నారు ప్రాంక్ స్టార్స్. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలోనూ అదే జరిగింది. ఇద్దరు యువకుడు రాత్రివేళ నడుచుకుంటూ వస్తుండగా.. సడెన్‌గా దెయ్యం నడుచుకుంటూ వారి ముందుకొచ్చింది. అది చూసిన వారిద్దిలో ఓ వ్యక్తి జడుసుకుని పరుగులు తీశాడు. మరో యువకుడు మాత్రం ఏమాత్రం భయపడకపోగా.. ఆ దెయ్యానికి మోకాళ్లపై కూర్చొని ఫ్లయింగ్ కిస్ ఇస్తూ ప్రపోజ్ చేశాడు. అతని చర్యకు దెయ్యమే బిత్తరపోయింది. కాసేపటికే మూర్చపోయి పడిపోయింది. ఈ సీన్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్ అవుతోంది. ఈ ప్రాంక్ వీడియోను చూసి నెటిజన్లు పడి పడి నవ్వుతున్నారు. అతని ధైర్యానికి సలామ్ కొడుతున్నారు. ఈ వీడియోకు ఇప్పటి వరకు వేలాది వ్యూస్, లైక్స్ వచ్చాయి. మరెందుకు ఆలస్యం ఈ ఫన్నీ ప్రాంక్ వీడియోను మీరూ చూసేయండి.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..