Viral Video : నీ ధైర్యానికి సలాం రా సామి!.. పాములతో ఆ ఆటలేంట్రా బాబు !!

|

Nov 06, 2022 | 5:31 PM

పాము కనిపించిందా వెనక్కి తిరగకుండా పారిపోతారు. కొంతమంది దాని నిర్ధాక్షణంగా చంపేస్తూ ఉంటారు. అయితే పాములు అంటే భయపడని వారు కూడా ఉంటారు.

Viral Video : నీ ధైర్యానికి సలాం రా సామి!.. పాములతో ఆ ఆటలేంట్రా బాబు !!
Snakes
Follow us on

ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జంతువులలో పాములు ఒకటి. పాములు ప్రమాదకరమైనవి కాబట్టి ప్రజలు వాటి పట్ల అప్రమత్తంగా ఉంటారు. పాము కనిపించిందా వెనక్కి తిరగకుండా పారిపోతారు. కొంతమంది దాని నిర్ధాక్షణంగా చంపేస్తూ ఉంటారు. అయితే పాములు అంటే భయపడని వారు కూడా ఉంటారు. ఏమాత్రం భయం లేకుండా వాటిని పట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు అలంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈవీడియో కాస్త భయానకంగానే ఉంది. ఈ వీడియోలో వ్యక్తి చేసిన పని ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈవీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో ఓ యువకుడు మూడు పెద్ద పాములను తన చేతితో పట్టుకున్నాడు. ఆ యువకుడు చాలా సింపుల్ గా పాములను తన చేతుల్లోకి తీసుకున్నాడు. యువకుడి మొహంలో ఏ మాత్రం కూడా భయం లేదు. ఈ వీడియో ఒకేసారి ప్రజలను ఆశ్చర్యపరిచింది అలాగే భయపెట్టింది.

ఇవి కూడా చదవండి

ఇది పంకజ్ సర్పమిత్ర ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేయబడిన వీడియో. ఈ వీడియో చాలా త్వరగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొన్ని గంటల్లోనే ఈ వీడియోకు వేల సంఖ్యలో లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోపై చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. ఆ వ్యక్తి విష సర్పాలను అలా చేతిలోకి తీసుకోవడం నిజంగా బయపెట్టిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..