ఓరేయ్.. పోతావ్ రేయ్.. ఇలాంటి చావు తెలివితేటలేంట్రా బాబు..! వీడియో చూస్తే ప్రాణాలు పైకే

|

Dec 17, 2024 | 12:20 PM

కొన్ని రీల్స్‌ చూస్తుంటే, మన కళ్లను మనమే నమ్మలేకుండా ఉంటున్నాయి. ఇక్కడ కూడా అలాంటిదే ఒక షాకింగ్‌ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక యువకు నడుస్తున్న రైలు ముందు పడుకుని ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది.

ఓరేయ్.. పోతావ్ రేయ్.. ఇలాంటి చావు తెలివితేటలేంట్రా బాబు..! వీడియో చూస్తే ప్రాణాలు పైకే
Reel Boy Under Train
Follow us on

ప్రస్తుతం అంతా రీల్స్‌ మానియా కొనసాగుతోంది. చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రీల్స్‌ చేస్తూ ఫేమస్‌ అవ్వాలని ఆరాటపడుతున్నారు. ఇక యువత ఈ పిచ్చి మరింత ముదురుతోందని చెప్పాలి. రీల్ బాయ్స్‌… రీల్ కోసం ఏమైనా చేస్తా… ఇదే నినాదంగా మారుతోంది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డానికి కొందరు ఏం చేయ‌డానికైనా సిద్ధ‌ప‌డుతున్నారు. కొంతమంది తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి కూడా వెనుకాడరు. ఇలాంటి వీడియోలు ఇప్పటికే అనేకం చూశాం. కొన్ని రీల్స్‌ చూస్తుంటే, మన కళ్లను మనమే నమ్మలేకుండా ఉంటున్నాయి. ఇక్కడ అలాంటిదే ఒక షాకింగ్‌ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక యువకు నడుస్తున్న రైలు ముందు పడుకుని ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది.

చౌహాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో,ఓ టీనేజీ యువకుడు రీల్స్‌ పిచ్చితో తన ప్రాణాలను పణంగా పెట్టాడు. రైల్వే ట్రాక్‌పై రైలు వచ్చిన శబ్దం స్పష్టంగా వినబడుతోంది. ఇంతలో ఒక యువకుడు నడుచుకుంటూ వచ్చి రైలు వస్తున్న ట్రాక్‌లోనే పడుకున్నాడు. అక్కడున్న మరికొందరు అదంతా ఫోటో షూట్ చేస్తున్నారు. ఇంతలో ఒక సూపర్ ఫాస్ట్ రైలు అతివేగంతో ట్రాక్ పైకి వచ్చింది. బాలుడు ఊపిరి బిగపట్టి నేలపై పడుకున్నాడు. రైలు అతడి మీదుగా వెళుతుంది. అది చాలా పొడవైన రైలు, యువకుడి మీదుగా వెళ్ళడానికి ఒక నిమిషం కంటే ఎక్కువ సమయం పట్టింది. ట్రాక్‌కి ఇటువైపు నిలబడి ఉన్న వ్యక్తి మొత్తం వీడియోలు చేస్తూ బిజీగా ఉన్నాడు. రైలు మొత్తం యువకుడి మీదుగా దాటివెళ్లింది.. ఆ వెంటనే అతడు తన బట్టలకు అంటుకున్న దుమ్మును దులుపుకుంటూ లేచి నిలబడతాడు.

ఇవి కూడా చదవండి

ఇన్‌స్టా రీల్‌పై నెటిజన్లు భారీగా కామెంట్లు చేస్తున్నారు. యమ ధర్మరాజు ఈరోజు సెలవు పెట్టినట్లుంది. అందుకే బతికిపోయావ్‌ అంటూ ఒకరు కామెంట్‌ చేశారు. మరొకరు కోపంతో ఇలాంటి వారు బ్రతికితే బాధగా ఉంది అంటూ మండిపడ్డారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి