CCTV Footage: దాబాలోకి దూసుకెళ్లిన బొలేరో.. ఏం జరిగిందో తెలియక అక్కడకు వచ్చిన కస్టమర్లు పరుగో పరుగు.. వైరల్ అవుతున్నసీసీటీవీ ఫుటేజీ..

|

Dec 20, 2022 | 10:22 AM

వేగంగా వెళ్తున్న బొలెరోలోని డ్రైవర్ దానిపై నియంత్రణ కోల్పోవడంలో ఈ ఘటన జరిగింది. ఫలితంగా బొలేరో గోడ, అక్కడ ఉన్న ఫర్నిచర్‌ను ఢీకొని రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లింది. వేగంగా వచ్చిన వాహనం రెస్టారెంట్‌లోని ఒక టేబుల్‌పైకి దూసుకెళ్లింది. ఇక అప్పటికే..

CCTV Footage: దాబాలోకి దూసుకెళ్లిన బొలేరో.. ఏం జరిగిందో తెలియక అక్కడకు వచ్చిన కస్టమర్లు పరుగో పరుగు.. వైరల్ అవుతున్నసీసీటీవీ ఫుటేజీ..
Bolero Crashes Into Dhaba
Follow us on

నేటి కాలంలో సోషల్ మీడియాలో అనేక వీడియోలు పోస్ట్ అవుతున్నాయి. వాటిలో కొన్ని మనకు ఉపయోగకరమైనవిగా ఉంటే మరికొన్ని సరదాగా నవ్వించేవి. ఇక అలాంటి వీడియోలను చూడడానికి కూడా మనం చాలా ఇష్టపడుతుంటాం. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న ఒక వీడియో రెండు రకాలుగానూ మనకు ఉపయోగపడేది. అంటే ఆ వీడియోను చూడడం వల్ల మనం కొంత సమాచారాన్ని తెలుసుకోవడమే కాక సరదాగా నవ్వేసుకుంటాం కూడా. అసలు ఈ వీడియో ఏమిటంటే గుజరాత్ సూరత్‌లోని ఓ దాబాకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ. ఇక ఆ సీసీటీవీ వీడియో బయటకు రావడంతో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియో ప్రకారం..  ఈ నెల 17న సూరత్‌ సరోలీ ప్రాంతంలోని ‘బపనో బాగీచో’ అనే దాబాలోకి ఒక్కసారిగా బోలేరో వాహానం దూసుకెళ్లింది. డాబాలోకి వేగంగా వచ్చిన ఆ వాహానాన్ని చూసి అక్కడ తినడానికి వచ్చినవారు పరుగులు తీశారు.

అయితే వేగంగా వెళ్తున్న బొలెరోలోని డ్రైవర్ దానిపై నియంత్రణ కోల్పోవడంలో ఈ ఘటన జరిగింది. ఫలితంగా బొలేరో గోడ, అక్కడ ఉన్న ఫర్నిచర్‌ను ఢీకొని రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లింది. వేగంగా వచ్చిన వాహనం రెస్టారెంట్‌లోని ఒక టేబుల్‌పైకి దూసుకెళ్లింది. ఇక అప్పటికే అక్కడ తింటున్న ఓ యువకుడి మీదకు వెళ్లడంతో అతనికి స్వల్పగాయాలయ్యాయి. ఘటనపై దాబా ఓనర్ దివ్య భాస్కర్ ‘ ఏం జరిగిందో తెలియలేదు. బొలేరో లోపలికి దూసుకొచ్చినప్పుడు నేను కౌంటర్లో ఉన్నాను. బొలేరో లోపలికి రాగానే దానిలోని డ్రైవర్ అక్కడనుంచి పారిపోయాడు. ఏం జరిగిందో అని తెలియక సీసీటీవీ ఫుటేజీ చూసాక ఆశ్యర్యపోయాం. ఈ ఘటన కారణంగా ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. వారిని దగ్గరలోని డైమండ్ హాస్పిటల్‌కు తరలించాం’ అని అన్నాడు.

ఇవి కూడా చదవండి

సీసీటీవీ ఫుటేజీ..


కాగా, ‘రాఘవేంద్ర పాండే’ అనే ఏఎన్ఐ కరెస్పాండెంట్ పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఇప్పటివరకు 66  వేలకు పైగా వీక్షణలు, 1000కి పైగా లైకులు వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..