Viral Video: కళ్లకు గంతలు కట్టుకుని లక్ష్యాన్ని ఛేదించిన వ్యక్తి.. తమ్ముడిని ఒలింపిక్స్‌కి పంపాలంటున్న నెటిజన్లు

|

Jul 11, 2023 | 12:26 PM

\మహాభారతంలో పాండవుల మధ్యముడు అర్జునుడి విలు విద్య గురించి అందరికీ తెలిసే ఉంటుంది.  ద్రౌపతి స్వయంవరంలో నీటిలో  కదులుతున్న చేప కంటిని గురి పెట్టి బాణం వేస్తాడు. ఈ విషయం మళ్ళీ గుర్తుకుతెస్తోంది ఈ వ్యక్తి గురి.. వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి తన కళ్ళకు గంతలు కట్టుకుని ఉన్నాడు.

Viral Video: కళ్లకు గంతలు కట్టుకుని లక్ష్యాన్ని ఛేదించిన వ్యక్తి.. తమ్ముడిని ఒలింపిక్స్‌కి పంపాలంటున్న నెటిజన్లు
Viral Video
Follow us on

స్మార్ట్ ఫోన్లు,  సోషల్ మీడియా, ఇంటర్ నెట్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత జంతువుల వీడియోలు, ఫన్నీ వీడియోలు, ప్రతిభకు సంబంధించిన వీడియాలు, ప్రకృతి వింతలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో కొందరి ప్రతిభకు సంబంధించిన వీడియాలు కూడా ఉంటున్నాయి. తమ లోకి టాలెంట్ ను ప్రదర్శిస్తూ పదువురిని ఆకర్షిస్తూ ఉంటున్నారు. కొందరు వంటల్లో తమ ప్రతిభను ప్రదరిస్తే.. మరికొందరు డ్యాన్స్, పెయింటింగ్, ఫైటింగ్, బైక్ రేసింగ్ లతో పాటు వివిధ క్రీడలకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతూ ఉంటాయి. అయితే తాజాగా ఒక వ్యక్తి టాలెంట్ కు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. అందులో వ్యక్తి నైపుణ్యం చూస్తే పాండవులలోని మధ్యముడు అర్జునుడిని గుర్తుకు తెస్తున్నాడు అని అంటారు.  సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి తన కళ్ళకు గంటలు కట్టుకుని  లక్ష్యాన్ని చేరుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు.

మహాభారతంలో పాండవుల మధ్యముడు అర్జునుడి విలు విద్య గురించి అందరికీ తెలిసే ఉంటుంది.  ద్రౌపతి స్వయంవరంలో నీటిలో  కదులుతున్న చేప కంటిని గురి పెట్టి బాణం వేస్తాడు. ఈ విషయం మళ్ళీ గుర్తుకుతెస్తోంది ఈ వ్యక్తి గురి.. వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి తన కళ్ళకు గంతలు కట్టుకుని ఉన్నాడు. చేతిలో ఒక ఉండేలను పట్టుకుని ఉన్నాడు. అతనికి కొంత ఎదురులో సైకిల్ తిరగేసి ఉంది. సైకిల్ వెనుక చక్రానికి ఒక బాటిల్ కట్టి ఉంది. అంతేకాదు సైకిల్ చక్రం గిరగిరా తిరుగుతూ ఉంటె.. కళ్ళకు గంతలు కట్టుకున్న వ్యక్తి ఉండేలుతో గురి తప్పకుండా బాటిల్ ను పగలగొట్టారు. చూసి కూడా కదులుతున్న వస్తువుని కొట్టాలంటే కొంచెం కష్టం అనిపించే ఈ ఫీట్ ను ఈ వ్యక్తి కళ్ళకు గంతలు కట్టుకుని మరీ  అద్భుతంగ లక్ష్యాన్ని చేధించాడు.

ఇవి కూడా చదవండి

ఈ గొప్ప వీడియో యూట్యూబ్ షాట్‌లలో షేర్ చేశారు. ఇప్పటికే 18 లక్షలకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు రకరకాల కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇతని గురి అద్భుతం.. ఇలాంటి నైపుణ్యం ఉన్న వ్యక్తిని ప్రోత్సహిస్తే మంచి క్రీడాకారుడు అవుతాడు. ఒలంపిక్స్ కు పంపిస్తే పతకం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఇలాంటి ప్రతిభను మనదేశంలో చిన్నారులకు అందించాలని అప్పుడే క్రీడల్లో మరింతగా రాణిస్తారు అంటూ వ్యక్తి ప్రతిభకు జే జే లు కొడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..