28 ఏళ్ల యువకుడు.. చూడటానికి బాగానే ఉంటాడు.. కానీ, అతనికో దుర్భుద్ధి ఉంది.. అప్పటికప్పుడే విచిత్రంగా ప్రవర్తిస్తాడు.. ఇలా అయితే బాగానే ఉంటుంది.. కానీ.. పక్క వాళ్లు విడిచిన బూట్ల దగ్గరకు వెళ్లి అమాంతం వాటిని తీసుకోని వాసన చూస్తాడు.. ఇది ఎప్పుడో ఒకసారి జరిగితే పర్లేదు.. రోజూ ఇలానే వేరే వారి బూట్లు వాసన చూస్తుండటం పెను ప్రమాదంగా మారింది.. అసలెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాక చుట్టుపక్కల జనం తలపట్టుకునేవారు.. దొంగచాటుగా వెళ్లడం.. బూట్ల వాసన చూడటం అలవాటుగా మారింది. ఇక.. ఇరుగు పొరుగు జనం ఇది తట్టుకోలేక పోలీసులకు సమచారం అందించారు.. కట్ చేస్తే.. పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయస్థానం జైలు శిఖ విధించింది. ఈ షాకింగ్ ఘటన గ్రీస్‌లోని థెస్సలొనీకిలో చోటుచేసుకుంది. గ్రీస్ లోని ఈ విచిత్రమైన కేసును విచారించిన ధర్మాసనం.. 28 ఏళ్ల వ్యక్తికి ఒక నెల జైలు శిక్ష విధించడంతోపాటు.. అతని విచిత్రమైన మానసిక ప్రవర్తనకు చికిత్స చేయవలసిందిగా ఆదేశించింది..
బూట్ల వాసన కోసం అతను పొరుగువారి ఇంటికి దొంగచాటుగా వెళ్లడం.. వారి బూట్ల వాసన చూడం అలవాటుగా మారింది.. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. థెస్సలొనీకిలో నివసించే వ్యక్తి, సాధారణంగా ఫుట్ ఫెటిష్ అని పిలవబడే సంకేతాలను ప్రదర్శించాడు. ఇది ఒక వ్యక్తి పాదాలు లేదా బూట్ల వాసన నుంచి ఒక రకమైన ఆనందం లేదా ఉద్రేకాన్ని పొందే పరిస్థితి. అతని ప్రవర్తన, ప్రమాదకరం కాదు.. కానీ.. అతని ఈ ప్రవర్తన పొరుగువారిని భయపెట్టింది.. చివరికి అతన్ని న్యాయపరమైన చిక్కుల్లో పడేలా చేసింది.
ఈ సంఘటన ఉత్తర గ్రీస్‌లోని సిండోస్ పట్టణంలో అక్టోబర్ 8న జరిగింది. ఆ రోజు తెల్లవారుజామున ఇంటి బయట ఉంచిన బూట్లను పసిగట్టిన యువకుడు.. అక్కడికి చేరుకుని వాసనను ఆస్వాదిస్తున్నాడు.. ఈ సమయంలో ఇరుగుపొరుగు వారు అతన్ని పట్టుకున్నారు. అతని చర్యలు వింతగా అనిపించినప్పటికీ, అతని పొరుగువారికి అవి పూర్తిగా కొత్తవి కావు. ఈ వింత ప్రవర్తనకు పాల్పడి పట్టుబడడం ఆరు నెలల్లో ఇది మూడోసారి. ప్రతిసారీ, దొంగతనం చేయడానికి లేదా నష్టం కలిగించడానికి బదులుగా, మనిషి బూట్లు వాసన చూసే ఏకైక ఉద్దేశ్యంతో ఇళ్లలోకి ప్రవేశిస్తాడని.. ఇది అతని పొరుగువారిని గందరగోళానికి.. ఆందోళనకు గురిచేసిందని పోలీసులు తెలిపారు.
ఈ సంఘటనలు జరిగినప్పటికీ, ఆ వ్యక్తి తమ పట్ల ఎలాంటి హింసాత్మక లేదా హానికరమైన ధోరణులను ప్రదర్శించలేదని అక్కడి వారు పేర్కొన్నారు. అయినప్పటికీ, అతని తరచూ ఈ ప్రవర్తన ఒక సమస్యగా మారింది.. అతని కుటుంబం జోక్యం చేసుకున్నా అతను మారలేదు.. చివరకు అన్ని ప్రయత్నాలు అయిన తర్వాత.. అక్కడి వారు అధికారులను ఆశ్రయించారు.. పదే పదే బూట్ల వాసన కోసం తమ ఇళ్లకు వస్తున్నాడంటూ అక్కడి వారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి.. కోర్టులో ప్రవేశపెట్టారు.. ఈ క్రమంలో తాను చేసిన తప్పును ఆ వ్యక్తి బహిరంగంగా అంగీకరించాడు. ఈ పనులన్నీ ఎప్పుడు చేయడం ప్రారంభించానో తనకు తెలియదని యువకుడు కోర్టుకు తెలిపాడు. ఇలాంటి పని పట్ల తాను చాలా సిగ్గుపడుతున్నానని.. ఈ బలవంతపు ప్రవర్తన తనకు చాలా సందర్భాలలో ఇబ్బంది కలిగించిందని, ఎవరికీ హాని కలిగించే ఉద్దేశం తనకు లేదని అతను చెప్పాడు.
దీంతో థెస్సలోనికి కోర్టు అతని మానసిక చికత్స అవసరమని అభిప్రాయపడింది.. నేరాన్ని అంగీకరించినందువల్ల ఒక జైలు శిక్ష.. తప్పనిసరి చికిత్స రెండింటినీ విధించడం అవసరమని వెల్లడించింది.. అంతేకాకుండా అతనికి మూడు సంవత్సరాల పరిశీలన అవసరం అని చెప్పింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..