Viral Video: ఎర కోసం పిల్లి పాచికలు.. చుట్టుముట్టి ముప్పుతిప్పలు పెట్టిన పక్షులు.. వైరల్ వీడియో

|

Jun 17, 2021 | 7:07 PM

జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి, వీటినే నెటిజన్లు ఎక్కువగా ఇష్టపడతారు. చాలా సార్లు..

Viral Video: ఎర కోసం పిల్లి పాచికలు.. చుట్టుముట్టి ముప్పుతిప్పలు పెట్టిన పక్షులు.. వైరల్ వీడియో
Cat War
Follow us on

జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి, వీటినే నెటిజన్లు ఎక్కువగా ఇష్టపడతారు. చాలా సార్లు ఈ వీడియోలు నెట్‌లో వైరల్‌ అవుతుంటాయి. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. జూట్‌ బోలే కవ్వా కాటే’ అనే పాటను విన్నం గానీ, ఇక్కడ మాత్రం నిజంగానే చూస్తున్నాం.

పిల్లి చాలా తెలివైన జంతువు అని మనందరికీ తెలుసు. తనకు కావాల్సిన ఆహారం ఎలాంటి ప్రదేశంలో ఉన్న సరే దాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇక్కడే కూడా ఓ పల్లి పక్షి గూడుపై దాడి చేసేందుకు మాటువేసింది. ఎత్తైన వంతెనపై నుంచి ఆ పల్లి ఎరను పట్టుకునేందుకు బయల్దేరింది.

కానీ, పిల్లి పాచికలు పారలేదు. తమ గూటిలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న పిల్లిని గమనించిన పక్షులు దానికి తగిన గుణపాఠం చెప్పాయి. పిల్లిని ముందుకు కదలనీయకుండా ముందు వెనుక నుంచి దాడి చేశాయి. ముక్కుతో పొడుస్తూ..ఆ పిల్లిని ముప్పుతిప్పలు పెట్టాయి ఆ పక్షులు. ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్టుగా మారింది ఆ పిల్లి పరిస్థితి..దీంతో చేసేది లేక తోక ముడిచుకుని అక్కడ్నుంచి జంప్‌ అయ్యింది ఆ దొంగ పిల్లి. ఈ ఫన్నీ వీడియోను ట్విట్టర్‌లో బ్యూటెంగేబీడెన్ అనే యూజర్ షేర్ చేశారు. కాగా, వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. దొంగపిల్లికి పక్షులు చెప్పిన గుణపాఠం భలే ఉందంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

గంగా నదిలో కొట్టుకొచ్చిన చెక్కపెట్టె.. అందులో ఎర్రని వస్త్రంలో చిన్నారి.! ఎక్కడ నుంచి వచ్చిందంటే.!

మీ బ్యాంక్ ఖాతాలోకి ఎల్‌పీజీ సబ్సిడీ డబ్బు రాలేదా.? ఫిర్యాదు చేయండిలా.! వివరాలివే..

 పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఆ సౌకర్యాన్ని ఉద్యోగం కోల్పోయినా పొందొచ్చు.!

కర్ఫ్యూపై సీఎం వైఎస్ జగన్ సంకేతాలు.. జూన్ 20 నుంచి మరిన్ని సడలింపులు..!