Viral Video: ట్రాఫిక్ రూల్స్.. ప్రతీ వాహనదారుడే కాకుండా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లే వారు సైతం వీటిని పాటించాలని, సురక్షితంగా గమ్యం చేరుకోవాలని ట్రాఫిక్ పోలీసులు నిత్యం చెబుతూనే ఉంటారు. ట్రాఫిక్ రూల్స్‌ని పాటించండి.. సురక్షితంగా ఉండండి అంటూ అనేక రకాలుగా ప్రచారాలు కూడా చేస్తుంటారు. కానీ, దాదాపు చాలా మంది వీటిని ఏమాత్రం పట్టించుకోరు. ఓవైపు నెత్తినోరు కొట్టుకుని అధికారులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ.. జనాలు వాటిని పెడచెవిన పెడుతుంటారు. భారీ జరిమానాలు విధిస్తున్నప్పటికీ ఏమాత్రం లక్ష్య పెట్టడం లేదు. తాజాగా ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. భీతి గొల్పించే డ్రైవింగ్‌కు సంబంధించింది ఈ వీడియో. ఇది చూస్తే జనాలు ఇక మారరు.. వీరికి అస్సలు బుద్ధి రాదు అంటూ తిట్టుకోక మానరంటే అతిశయోక్తి కాదు. వీడియో చూసిన నెటిజన్లు సైతం.. సీరియస్‌గా రియాక్ట్ అవుతున్నారు.
తాజాగా నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ వ్యక్తి తన బైక్‌పై ఒక్కరిని కాదు.. ఇద్దరిని కాదు.. ఏకంగా 13 మంది చిన్న పిల్లలను ఎక్కించుకున్నాడు. ఆపై సరదాగా పాట పాడుతూ రోడ్డుపై చక్కర్లు కొట్టాడు. బైక్‌పై ఉన్న పిల్లలంతా రెండేళ్ల నుంచి పదేళ్ల వయస్సు ఉన్నవారే. బైక్ సీట్లు, చక్రాలు మొదలు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చొబెట్టాడు. కొంతమందిని తన భుజాలపై కూర్చొబెట్టుకుంటే.. ఇంకొంతమంది పిల్లలు అయితే బండిని పట్టుకుని వేలాడుతున్నారు కూడా. ఇక పిల్లలేమో సరదాగా పాటపాడుతూ ఆ రైడింగ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియోను గీడ్డే అనే ఇన్‌స్టాగ్రమ్ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. రైడింగ్ బాగుంది కానీ.. ఎవరికైనా ఏమైనా అయితే ఎవరిది బాధ్యత అని ప్రశ్నిస్తూ క్యాప్షన్ పెట్టారారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ చర్యపై మండిపడుతున్నారు. స్టంట్స్ పేరుతో పిల్లల జీవితాలతో ఆడుకోవడం ఏంటని నిలదీస్తున్నారు. ఇలా ఎవరూ చేయొద్దని హితవుచెబుతున్నారు. ఈ వీడియోను సెప్టెంబర్ 9వ తేదీన పోస్ట్ చేయగా.. ఇప్పటి వరకు 50 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.
Viral Video:
Also read:
Hyderabad: గర్భవతి అయిన భార్యను కెనడాలో వదిలేసి వచ్చిన భర్త.. సీన్ కట్ చేస్తే ఒక్క లేఖతో..
Hyderabad: సింగరేణి కాలనీ ఘటనపై పోలీసుల నజర్.. వారందరిపై కేసులు నమోదు..!