Watch: ఎందుకంత తొందర గురూ..! త్వరగా వెళ్లాలనుకున్నాడు.. ఇలా ఇరుక్కుపోయాడు..

|

Sep 17, 2024 | 3:18 PM

ఈ బస్సుల మధ్యల్లోంచి వెళ్ళడానికి కొంచెం ఖాళీ మాత్రమే ఉంది. అందులోంచి మనిషి నడిచి వెళ్లడమే కష్టం.. కానీ, బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ఆ రెండు బస్సుల మధ్యలోకి వచ్చాడు. అంతే.. అతను ఆ సందులోనే ఇరుక్కుపోయాడు. ముందుకు వెళ్లలేక, బయటకు రాలేక ఇబ్బంది పడాల్సి వచ్చింది.

Watch: ఎందుకంత తొందర గురూ..! త్వరగా వెళ్లాలనుకున్నాడు.. ఇలా ఇరుక్కుపోయాడు..
Scooter Riders
Follow us on

ఏదో ఒక పని కోసం ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం జీవితం విలువైనదని భావించాలి. ప్రాణాలను పణంగా పెట్టి గమ్యాన్ని చేరుకోవడానికి ఎప్పుడూ తొందరపడకూడదు. ఇలాంటి హడావుడి మీ ప్రాణాలను హరించివేస్తుంది. ఇందుకు ఉదాహరణగా అనేక వీడియోలు సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. బైక్‌తో విన్యాసాలు చేస్తున్న వ్యక్తుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు చూస్తుంటే మనిషి ప్రాణానికి విలువ లేదనిపిస్తోంది. ఇటీవల ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఒక బైక్ రైడర్ తొందరగా వెళ్లాలనే ఆరాటంతో రెండు బస్సుల మధ్యలోకి దూరి ఇరుక్కుపోయాడు..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను ఓ బస్‌ డ్రైవర్‌ రికార్డ్‌ చేశాడు. ఈ వీడియోలో చూస్తుంటే అదేదో రద్దీగా ఉన్న రోడ్డుగా కనిపించింది. రోడ్డు పొడవునా వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి. రెండు బస్సులు పక్కపక్కనే ఆగిపోయి ఉన్నాయి. ఈ బస్సుల మధ్యల్లోంచి వెళ్ళడానికి కొంచెం ఖాళీ మాత్రమే ఉంది. అందులోంచి మనిషి నడిచి వెళ్లడమే కష్టం.. కానీ, బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ఆ రెండు బస్సుల మధ్యలోకి వచ్చాడు. అంతే.. అతను ఆ సందులోనే ఇరుక్కుపోయాడు. ముందుకు వెళ్లలేక, బయటకు రాలేక ఇబ్బంది పడాల్సి వచ్చింది. చివరకు ఓ బస్సు ముందుకు కదలడంతో బైకర్‌ తప్పించుకోగలిగాడు.. ఈ వీడియో డిస్క్ స్మార్ట్ అనే ఖాతా ద్వారా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో షేర్ చేయబడింది. ఈ వీడియోపై నెటిజన్లు పెద్ద సంఖ్యలో కామెంట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

ఒకరు దీనిపై స్పందిస్తూ..ఇంత చిన్న సందులోకి ఎందుకు వెళ్లాలి అంటూ ఒకరు ప్రశ్నించగా, ఇది బస్సు డ్రైవర్‌ తప్పు అని ఒకరు.. బైక్‌ రైడర్‌ తప్పు అని మరొకరు కామెంట్‌ చేశారు. కాదు.. బైకర్ తప్పు అంటూ ఎక్కువ మంది విమర్శించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..