Wedding Video: సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా.. పెళ్లికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి అందరూ షాకవుతున్నారు. వరుడు పెళ్లి పీటలపైనే కట్నం ఇవ్వాలంటూ బెదిరిస్తున్నాడు. లేకపోతే పెళ్లిని ఆపేస్తానంటూ పేర్కొంటాడు. వాస్తవానికి మహిళల హక్కులను పరిరక్షించడం కోసం ఎన్నో చట్టాలు ఉున్నాయి. దీంతోపాటు వరకట్న నిషేధ చట్టం కూడా ప్రధాన అస్త్రంగా ఉంది. దేశంలో కట్నం అడగడం, ఇవ్వడం రెండూ శిక్షార్హమైన నేరం. ఈ చట్టాలు ఉన్నప్పటికీ.. వరకట్నం వేధింపులు పెళ్లి అయ్యే యువతులను, వివాహితులను వారి కుటుంబాలను వెంటాడుతూనే ఉంది. కట్నం కోసం చివరి క్షణంలో పెళ్లిని రద్దు చేసుకుంటానని వరుడు బెదిరించిన సంఘటన ఈ దుష్ట ఆచారానికి ఒక ఉదాహరణ నిలిచింది. ఒక వైరల్ వీడియోలో.. వరుడు తన డిమాండ్లను నెరవేర్చకపోతే పెళ్లి చేసుకోనని స్పష్టంగా చెబుతాడు. ఈ విస్తుపోయే సంఘటన బీహార్‌లోని చప్పల్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వైరల్ వీడియో (Viral Video) లో వరుడు బెదిరిస్తున్న సంఘటన మొత్తం రికార్డయ్యింది. వరుడు తీరును చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. అయితే.. అక్కడున్న ఒకరు.. వరుడు మాట్లాడేటప్పుడు వీడియో తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఒక ఉపాధ్యాయుని కొడుకు.. అదేవిధంగా ప్రభుత్వోద్యోగి అయిన వరుడు.. వధువును బెదిరించాడని పేర్కొంటున్నారు. వరకట్నం ఇవ్వకపోతే.. వివాహం చేసుకోకుండా వెనక్కి వెళ్లిపోతానని వధువు కుటుంబాన్ని బెదిరించాడు. దీనిపై నిలదీసిన వ్యక్తిని కూడా.. కట్నం ఇవ్వకపోతే ఇప్పుడే వెళ్తానంటూ పేర్కొంటాడు.
అయితే.. తన కుటుంబ సభ్యులు.. వరుడు అడిగిన వాటిని ఇచ్చారని.. ఇంకా కేవలం రూ.లక్ష నగదు మాత్రమే ఇవ్వాలని వధువు చెబుతోంది. అయితే ప్రస్తుతం తనకు అన్నీ కావాలని వరుడు వీడియోలో బెదిరిస్తూ చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
వైరల్ వీడియో..
— हम लोग We The People (@humlogindia) March 6, 2022
దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. కట్నం అనేది తీవ్రమైన నేరం అయినప్పటికీ అది ఇప్పటికీ ఆచరణలో ఉండటం మంచిది కాదని యూజర్లు పేర్కొంటున్నారు. కానీ ఇలా డిమాండ్ చేయడం మాత్రం సమంజసం కాదని.. చదువుకున్న వారు ఇలా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
Also Read: