Gene sequencing: లక్ష సంవత్సరాల మానవ వంశవృక్షం సృష్టి.. ఆక్స్‌ఫర్డ్‌ పరిశోధకుల కృషి .. సంచలనంగా మారిన వీడియో..

Gene sequencing: లక్ష సంవత్సరాల మానవ వంశవృక్షం సృష్టి.. ఆక్స్‌ఫర్డ్‌ పరిశోధకుల కృషి .. సంచలనంగా మారిన వీడియో..

Anil kumar poka

|

Updated on: Mar 08, 2022 | 9:48 PM

ఒక లక్ష ఏళ్ల కిందటి అతి పెద్ద మానవ వంశవృక్షాన్ని బ్రిటన్‌ పరిశోధకులు సృష్టించారు. ఈ వంశవృక్షం మన పూర్వీకులు ఎవరు.. వారు ఎప్పుడు ఎక్కడ నివసించేవారు వంటి వివరాలన్నీ చెబుతుంది. ఈ కథనం సైన్స్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. వైద్య పరిశోధనలకు సహకరించేలా


ఒక లక్ష ఏళ్ల కిందటి అతి పెద్ద మానవ వంశవృక్షాన్ని బ్రిటన్‌ పరిశోధకులు సృష్టించారు. ఈ వంశవృక్షం మన పూర్వీకులు ఎవరు.. వారు ఎప్పుడు ఎక్కడ నివసించేవారు వంటి వివరాలన్నీ చెబుతుంది. ఈ కథనం సైన్స్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. వైద్య పరిశోధనలకు సహకరించేలా ఈ వంశవృక్షం ఉంటుందది. జన్యుపరమైన వ్యాధులను ముందే గుర్తించడంలో సహాయపడుతుంది. ఇప్పటివరకు ఇటువంటి వంశవృక్షాన్ని రూపొందించడంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. వీటిని అధిగమించి బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఓ కొత్త విధానాన్ని రూపొందించారు. మిలియన్లకొద్దీ జన్యు శ్రేణులకు అనుగుణంగా బహుళ మూలాల నుంచి వివరాలను కలిపి విశ్లేషించవచ్చని బ్రిటన్ పరిశోధకులు తేల్చారు. ‘మేము ప్రాథమికంగా ఓ భారీ కుటుంబ వృక్షాన్ని నిర్మించాం. ఈ వంశావళి ప్రతి వ్యక్తి జన్యుశ్రేణి మరొకరితో ఎలా సంబంధం కలిగి ఉంటుందో చూసేందుకు అనుమతిస్తుంది’ అని ఆక్స్‌ఫర్డ్‌లోని బిగ్‌డేటా ఇన్‌స్టిట్యూట్‌ పరిణామ జన్యు శాస్త్రవేత్త యాన్‌ వాంగ్‌ తెలిపారు. ఈ అధ్యయనం తర్వాతి తరం డీఎన్‌ఏ పరంపరకు పునాది వేస్తుందన్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…

Rana Daggubati: విభిన్న పాత్రలకి కేరాఫ్ అడ్రస్ ఆయన.. బళ్లాళ దేవ అయినా.. డానియెల్ శేఖర్ అయినా..! ట్రెండ్ మార్చిన ‘రానా’ ఫొటోస్

Rashmika Mandanna: కొంటె చూపులతో కవ్విస్తున్న ‘శ్రీవల్లి’.. గ్లామర్ డోస్‌లో ‘తగ్గేదేలే’.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫోటోలు..

Jacqueline Fernandez: అబ్భురపరిచే వయ్యారాలతో చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ ‘జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌’..ఫొటోస్