Viral: హాలీడే ఎంజాయ్ చేసేందుకు విదేశాలకు వెళ్లాడు.. కట్ చేస్తే.. ఇంటిని చూసి కళ్లు తేలేసాడు!

|

Aug 12, 2022 | 1:32 PM

ఓ ఫ్యామిలీ హాలీడేను ఎంజాయ్ చేసేందుకు విదేశాలకు వెళ్లారు. తమ ఇంటిని చూడమని దూరపు బంధువుకు చెప్పగా..

Viral: హాలీడే ఎంజాయ్ చేసేందుకు విదేశాలకు వెళ్లాడు.. కట్ చేస్తే.. ఇంటిని చూసి కళ్లు తేలేసాడు!
Representative Image 11
Follow us on

ఓ ఫ్యామిలీ హాలీడేను ఎంజాయ్ చేసేందుకు విదేశాలకు వెళ్లారు. తమ ఇంటిని చూడమని దూరపు బంధువుకు చెప్పగా.. అతడు అక్కడికి చేరుకోగానే ఒక్కసారిగా షాకయ్యారు. అక్కడ కనిపించిన దృశ్యానికి కళ్లు తేలేసాడు. ఇంతకీ అసలేం జరిగిందంటే..

వివరాల్లోకి వెళ్తే.. భోపాల్‌కు చెందిన వశిష్ట్ సింగ్ అనే వ్యక్తి ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి హాలిడే నిమిత్తం కెనడా వెళ్లాడు. జూన్ 12వ తేదీన వశిష్ట దంపతులు.. కెనడాలోని తన కొడుకు దగ్గరకు వెళ్లారు. సరిగ్గా రెండు నెలలు అనంతరం.. అంటే ఆగష్టు 8వ తేదీన వశిష్ట తన దూరపు బంధువైన యోగేంద్ర ప్రతాప్ సింగ్‌ను తమ ఇంటిని శుభ్రం చేయాలని చెప్పగా.. అతడు అక్కడికి చేరుకోగానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ ఇంటి తలుపులకు వేసిన తాళాలు పగలగొట్టి ఉండటమే కాకుండా.. ఇంట్లోని వస్తువులు అన్నీ కూడా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

అలాగే అల్మారాలో ఉంచిన 408.1 గ్రాముల బంగారు ఆభరణాలు, ఎల్‌ఈడీ టీవీ, డీవీఆర్ సహా రూ. 20 లక్షల క్యాష్ మాయం కావడంతో యోగేంద్ర వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించాడు. కాగా, తన ఇంట్లో దొంగతనం జరిగిందని తెలియడంతో వశిష్ట్ భోపాల్ చేరుకున్నాడు. పోలీసులకు దొంగలించబడిన వస్తువుల సమాచారాన్ని అందజేశాడు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇది చదవండి: టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..