తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీ ప్రచారంతో దూసుకుపోతున్నాయి. కేంద్రంలోని బీజేపీ తెలంగాణలో పట్టుకోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ సీనియర్ నేతలు, ప్రధాని సహా తెలంగాణలో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం రోజున ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో రెండో రోజు పర్యటన కొనసాగింది. మోదీ పర్యటనలో భాగంగా..ఆదివారం నిర్మల్ జిల్లాలో మోదీ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సమయంలో, ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీలో భరత మాత వేషంలో కనిపించిన ఒక చిన్నారి అందరి దృష్టిని ఆకర్షించింది. మోదీ ర్యాలీ సందర్బంగా ఆ చిన్నారికి సంబంధించిన వీడియో హృదయానికి హత్తుకునే ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆ చిన్నారికి తన ఆశీస్సులు అందించారు.
ప్రస్తుతం ఆ చిన్నారికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ఓ చిన్నారి భారత మాత వేషంలో కనిపిస్తుంది. ఆ చిన్నారి చేతిలో త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ కనిపించింది. పైగా ఆ చిన్నార భరతమాత జాతీయ జెండా ఊపుతూ మోదీకి అభివాదం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ సమయంలో ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ దృష్టి ఒక్కసారిగా ఆ చిన్నారి వైపుకి మళ్లింది. సభ వేదికగానే ఆ చిన్నారిని ప్రశంసించారు ప్రధాని మోదీ.
ఈ చిన్నారి భారతదేశం తల్లిగా ఇక్కడకు వచ్చింది. ఈ చిట్టితల్లి ప్రతి వ్యక్తిలోనూ దేశభక్తిని ప్రేరేపిస్తోంది. బహిరంగ సభ వేధికగా మోదీ ఆ అమ్మాయి వైపు చేతులెత్తి ఆశీర్వదించారు.
निर्मल, तेलंगाना: प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, “आज पूरी दुनिया ‘मेक इन इंडिया’ पहल की सराहना कर रही है, लेकिन बीआरएस और कांग्रेस को देखिए, वे ‘मेक इन इंडिया’ के बारे में बात तक नहीं करते हैं। बीआरएस और कांग्रेस की इस मानसिकता ने निर्मल के सदियों पुराने खिलौना उद्योग को… pic.twitter.com/ymPLmTCfho
— ANI_HindiNews (@AHindinews) November 26, 2023
ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. నేడు ప్రపంచం మొత్తం మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని మెచ్చుకుంటున్నదని అన్నారు. BRS మరియు కాంగ్రెస్‌ల పరిపాలన నిర్మల్‌లోని పురాతన బొమ్మల పరిశ్రమను ఛిన్నాభిన్నం చేసిందన్నారు… నేడు భారతదేశం బొమ్మల ఎగుమతిలో కొత్త రికార్డులు సృష్టిస్తున్నప్పుడు, BRS నిర్మల్‌లోని బొమ్మల పరిశ్రమను నాశనం చేయడం పట్ల మోదీ అగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మల్‌లోని బొమ్మల పరిశ్రమను పునరుజ్జీవింపజేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..