2024 Elections: పిక్చర్‌ ఆఫ్‌ది డే..! ఆనంద్‌ మహీంద్రా షేర్‌ చేసిన ఫోటోకు నెటిజన్ల రియాక్షన్‌..

|

May 21, 2024 | 3:59 PM

ఇది చూసిన నెటిజన్లు సైతం పిక్చర్‌ ఆఫ్‌ది డే అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మీకు ఓటు హక్కు కల్పించింది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది చర్చనీయాంశం కాదు. కానీ, ఈ చిత్రం భారతదేశంలో ప్రజాస్వామ్య విజయానికి చిహ్నం. సమాజంలో వెనుక పూర్తిగా వెనుబడిన వ్యక్తులు ఈ ప్రజాస్వామ్య పండుగలో పాల్గొన్నారని మరొక వినియోగదారు రాశారు. ఇది అద్భుతమైన చిత్రం అంటూ ప్రశంసించారు.

2024 Elections: పిక్చర్‌ ఆఫ్‌ది డే..! ఆనంద్‌ మహీంద్రా షేర్‌ చేసిన ఫోటోకు నెటిజన్ల రియాక్షన్‌..
Anand Mahindra
Follow us on

మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇంటర్‌నెట్‌ ఫాలోవర్స్‌ కూడా ఆయనకు ఎక్కువగానే ఉన్నారు. ఆనంద్‌ మహీంద్రా ఎప్పుడూ స్ఫూర్తిదాయ‌క‌, వినోదాత్మక పోస్ట్‌లు, సందేశాత్మక ఫొటోలు, వీడియోల‌ను అభిమానులతో షేర్ చేస్తుంటారు. తాజాగా ఆనంద్‌ మహీంద్రా షేర్ చేసిన ఒక ఫోటో నెట్టింట చర్చనీయాంశంగా మారింది. 2024 ఎన్నికల్లో ఇదే బెస్ట్‌ ఫొటో అంటూ ఒక ఫోటోను షేర్‌ చేశారు ఆనంద్‌ మహీంద్రా. మే 20 సోమవారం ముంబైలో లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం ఓటింగ్‌కు సంబంధించిన ఫోటోను షేర్‌ చేశారు. ఇందులో షోంపెన్ తెగకు చెందిన ప్రజలు తొలిసారిగా ఓటు వేస్తూ కనిపించారు. ఆనంద్ మహీంద్రా దీనిని ఎన్నికల ఉత్తమ ఫోటోగా అభివర్ణించారు.

భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా అండమాన్ నికోబార్ దీవుల్లోని షోంపెన్‌ తెగకు చెందిన ఏడుగురిలో ఒకరు మొదటిసారి ఓటు వేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను ఆనంద్‌ మహీంద్రా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్‌ చేశారు. దీనికి క్యాప్షన్‌లో ఇది ప్రజాస్వామ్యానికి ఎదురులేని, తిరుగులేని శక్తి అంటూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌ అవుతోంది. నికోబార్ ద్వీపసమూహంలోని అతిపెద్ద ద్వీపమైన గ్రేట్ నికోబార్ దట్టమైన అడవులలో షోంపెన్ వంశానికి చెందిన ప్రజలు నివసిస్తున్నారు. వీరికి బయటి ప్రపంచంతో పరిచయం తక్కువ. షోంపెన్ వంశానికి చెందిన ప్రజలు సంచార స్వభావం కలిగి ఉంటారు.

ఇదిలా ఉంటే, ఈ ఫోటోపై సోషల్ మీడియాలో అద్భుతమైన కామెంట్స్ వచ్చాయి. ఆనంద్ మహీంద్రా ఈ ఫోటో షేర్ చేసిన వెంటనే నెటిజన్ల నుండి విపరీతమైన స్పందనలు రావడం ప్రారంభించాయి. ఇది చూసిన నెటిజన్లు సైతం పిక్చర్‌ ఆఫ్‌ది డే అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మీకు ఓటు హక్కు కల్పించింది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది చర్చనీయాంశం కాదు. కానీ, ఈ చిత్రం భారతదేశంలో ప్రజాస్వామ్య విజయానికి చిహ్నం. సమాజంలో వెనుక పూర్తిగా వెనుబడిన వ్యక్తులు ఈ ప్రజాస్వామ్య పండుగలో పాల్గొన్నారని మరొక వినియోగదారు రాశారు. ఇది అద్భుతమైన చిత్రం అంటూ ప్రశంసించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..