నెలకు రూ. 80,000 సంపాదిస్తున్న బైక్ డ్రైవర్.. అతడి మాటలు వింటే సెల్యూట్‌ చేయాల్సిందే..!

|

Dec 10, 2024 | 12:59 PM

అతని నెల జీతం విని నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో కర్ణాటక పోర్ట్‌ఫోలియో (@karnatakaportf) అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయబడింది. ప్రస్తుతం వైరల్ అవుతోంది.

నెలకు రూ. 80,000 సంపాదిస్తున్న బైక్ డ్రైవర్.. అతడి మాటలు వింటే సెల్యూట్‌ చేయాల్సిందే..!
Bengaluru Uber Bike Driver
Follow us on

బెంగళూరుకు చెందిన ఉబెర్ బైక్ డ్రైవర్ నెలకు రూ. 80,000 సంపాదిస్తున్నట్లు చెప్పారు. అతడు తన సంపాదన గురించి చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతని నెల జీతం విని నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో కర్ణాటక పోర్ట్‌ఫోలియో (@karnatakaportf) అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయబడింది. ప్రస్తుతం వైరల్ అవుతోంది.

వైరల్ వీడియోలో ఉబర్ బైక్ డ్రైవర్ హిందీలో మాట్లాడుతున్నాడు. అతని మాటల ప్రకారం.. నేను రోజుకు 13 గంటలు పనిచేసి నెలకు దాదాపు రూ.80,000 సంపాదిస్తున్నాను అని చెబుతున్నాడు. అంతేకాదు ‘నేను ఎవరి ఒత్తిడికి లోనుకాను, నాపై ఎవరూ అజమాయిషి చేయరు..నాకు నేనే యజమాని అని వీడియోలో పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియో డిసెంబర్ 04న షేర్ చేయబడింది. కేవలం 5 రోజుల్లోనే 6 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. అంతేకాకుండా ఉబర్ బైక్ డ్రైవర్ మాటలకు పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..