Viral news: నాపేరు కొవిడ్‌.. నేను వైరస్‌ను కాదు.. నెట్టింట్లో మార్మోగుతున్న బెంగళూర్ ఎంటర్ ప్రెన్యూర్ పేరు..

|

Jan 06, 2022 | 7:29 PM

ఇది బెంగళూరుకు చెందిన ఓ ఎంటర్‌ ప్రెన్యూర్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్లలో తన గురించి పెట్టుకున్న బయో. 2020కి ముందు వరకు కరోనా, కొవిడ్‌ లాంటి పదాలు మనకు పెద్దగా పరిచయం లేదు. అయితే మార్కెట్లో కరోనా పేరుతో ఒక బీర్‌ లభిస్తుంది. ఇది కూడా

Viral news: నాపేరు కొవిడ్‌.. నేను వైరస్‌ను కాదు.. నెట్టింట్లో మార్మోగుతున్న బెంగళూర్ ఎంటర్ ప్రెన్యూర్ పేరు..
Kovid Kapoor
Follow us on

ఇది బెంగళూరుకు చెందిన ఓ ఎంటర్‌ ప్రెన్యూర్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్లలో తన గురించి పెట్టుకున్న బయో. 2020కి ముందు వరకు కరోనా, కొవిడ్‌ లాంటి పదాలు మనకు పెద్దగా పరిచయం లేదు. అయితే మార్కెట్లో కరోనా పేరుతో ఒక బీర్‌ లభిస్తుంది. ఇది కూడా కొందరికి మాత్రమే తెలుసు. ఇక కరోనా కాలంలో పుట్టిన తమ పిల్లలకు చాలామంది పేరెంట్స్ కరోనా, కొవిడ్‌ అని పేర్లు పెట్టుకున్న సంఘటనలు కూడా చూశాం. కానీ అసలు కరోనా మన జీవితంలోకి అడుగుపెట్టక ముందే కొవిడ్‌ పేరుతో ఒక మనిషి కూడా ఉన్నాడని తెలుసా. అతనే బెంగళూరుకు చెందిన హోలిడిఫై అనే ఆన్‌లైన్‌ టూర్‌ ట్రావెల్స్‌ కంపెనీ సహ వ్యవస్థాపకుడు కోవిడ్‌ కపూర్‌. ఎప్పుడైతే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడించడం మొదలైందో అప్పటి నుంచి ఈ కోవిడ్‌ కపూర్‌కి తన పేరుతో సమస్యలు మొదలయ్యాయి.

జీవితం నాకు పుల్లని నిమ్మకాయను ఇచ్చింది.. కానీ..
తన పేరు కారణంగా సోషల్‌ మీడియా వేదికగా చాలామంది అతనిపై రకరకాల జోక్‌లు, కామెంట్లు చేసేవాళ్లు. వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్లినప్పుడు తన పేరు విని విమానాశ్రయ అధికారులు, సిబ్బంది విని ఆశ్చర్యపోతున్నారు. దీంతో అతను తన సోషల్‌ మీడియా అకౌంట్లలో’నా పేరు కోవిడ్‌.. నేను వైరస్‌ కాదు’ అని పెట్టుకోవాల్సి వచ్చింది. అయితే కొవిడ్‌ పేరుతో తనను ఆటపట్టిస్తున్నా అతనేమీ బాధపడడం లేదు. పైగా సానుకూలంగా తీసుకుంటున్నాడు. అంతేకాదు హనుమాన్‌ చాలీసాలో తన పేరుకి ‘పండితుడు’ లేదా ‘ప్రావీణ్యం ఉన్న వ్యక్తి’ అని ఉందని చెబుతున్నాడు. ఇటీవల అతని పుట్టిన రోజుకి తన స్నేహితులు కేక్‌ని ఆర్డర్‌ చేశారు. పాపం ఆ కేకు మీద కోవిడ్‌(kovid) అని కాకుండా covid అని బేకరి వాళ్లు తప్పుగా రాశారని చెప్పాడు. ‘ నా పేరు మార్చుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. పైగా నా పేరుతో నేను ఎంతోసంతోషంగా ఉంటున్నాను. ఎందుకంటే ఇది ఇప్పుడు అందరికీ గుర్తుండిపోయే పేరు. నా పేరు కారణంగా అమెజాన్ డెలివరీ కుర్రాళ్లతో, ఎలక్ట్రీషియన్లతో, విమానాశ్రయాలు, హోటల్ చెక్-ఇన్‌ సిబ్బందిలో చాలామందితో పరిచయం పెరిగింది. జీవితం నాకు పుల్లని నిమ్మకాయను ఇచ్చింది. అయితే నేను దానితో రుచికరమైన నిమ్మరసం తయారు చేసుకుని తాగుతాను ‘ అని అంటున్నాడు కొవిడ్‌ కపూర్‌.

Also Read:

Hyderabad: సీఎం రమేశ్ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు జీహెచ్‌ఎంసీ యత్నం.. అడ్డుకున్న ఎంపీ అనుచరులు..

IT Raids: తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడుల కలకలం.. రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల్లో విస్తృత తనిఖీలు..

Viral video: అభిమాని బట్టతలపై ఆటోగ్రాఫ్‌ ఇచ్చిన ఇంగ్లండ్‌ స్పిన్నర్‌.. నవ్వులు పూయిస్తోన్న ఫన్నీ వీడియో..