వెరీ స్మార్ట్‌..! ఆటోవాలా నా మజాకా.. పేమెంట్స్ కోసం వినూత్న ఆలోచన.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే

|

Sep 23, 2024 | 11:12 AM

ఈ ఆటో డ్రైవర్ చాలా తెలివైనవాడు, ఇది డిజిటల్ ఇండియా మాయాజాలం" అని మరొ వ్యక్తి రాశాడు. ఆధునిక సమస్యలకు ఆధునిక పరిష్కారాలు అవసరం" అని మరొకరు రాశారు. "బెంగళూరును భారతదేశంలోని టెక్ సిటీ అని ఎందుకు పిలుస్తారో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది అని మరొక నెటిజన్‌ రాశాడు.

వెరీ స్మార్ట్‌..! ఆటోవాలా నా మజాకా.. పేమెంట్స్ కోసం వినూత్న ఆలోచన.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే
Smartwatch Qr Code
Follow us on

భారతదేశం ఇప్పుడు పాత భారతదేశం కాదు. ఇది డిజిటల్ ఇండియా. నగదు లావాదేవీలు తగ్గాయి. మనలో చాలామంది డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. పెద్ద పెద్ద మాల్స్‌ వంటి దుకాణాలు మొదలు.. చిరు వ్యాపారులు, కూరగాయలు అమ్ముకునే వాళ్ల వరకు అందరూ ఆన్‌లైన్‌ పేమెంట్స్‌కే అలవాటుపడ్డారు. ఈ క్రమంలోనే బెంగళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. ‘పిక్ బెంగళూరు’కి ఇది మరో ఉదాహరణ అంటూ సోషల్ మీడియా వినియోగదారులు అంటున్నారు. అసలు విషయంలోకి వెళితే…

సోషల్ మీడియాలో ‘పిక్ బెంగళూరు’ సందడి నెలకొంది. బెంగుళూరులోని ఓ ఆటో డ్రైవర్ తన స్మార్ట్‌వాచ్‌లో క్యూఆర్ కోడ్ చూపించి ఛార్జీని వసూలు చేస్తున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో,ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో అతను తన స్మార్ట్ వాచ్‌లో క్యూఆర్ కోడ్‌ను చూపుతున్నాడు.

ఇవి కూడా చదవండి

ఆటోడ్రైవర్‌ తన స్మార్ట్‌వాచ్‌లోని క్యూఆర్ కోడ్‌ను తన ప్రయాణికుడికి చూపుతున్న ఫోటో “ఆటో అన్నా #PickBengaluru పని చేస్తుంది” అనే క్యాప్షన్‌తో షేర్ చేయబడింది. ఈ ప్రత్యేకమైన సాంకేతికతను ఉపయోగించుకున్నందుకు సోషల్ మీడియా వినియోగదారులు అతనిని ప్రశంసించారు. ఈ పోస్ట్‌ మొదట ఎక్స్‌ హ్యాండిల్ ‘పిక్ బెంగళూరు’లో షేర్ చేయబడింది. ఆ తర్వాత చాలా మంది షేర్ చేశారు. లక్షలాది మంది ఇది చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఈ పోస్ట్ పై క్లిక్ చేయండి..

ప్రతి ఒక్కరూ ఈ పోస్ట్‌పై తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అన్నా, మీరు మా అందరికీ స్ఫూర్తి అంటూ ఒకరు కామెంట్‌ చేయగా, ఆటో అన్నా డిజిటల్‌గా మారిపోయాడు అంటూ మరొకరు రాశారు. ఈ ఆటో డ్రైవర్ చాలా తెలివైనవాడు, ఇది డిజిటల్ ఇండియా మాయాజాలం” అని మరొ వ్యక్తి రాశాడు. ఆధునిక సమస్యలకు ఆధునిక పరిష్కారాలు అవసరం” అని మరొకరు రాశారు. “బెంగళూరును భారతదేశంలోని టెక్ సిటీ అని ఎందుకు పిలుస్తారో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది అని మరొక నెటిజన్‌ రాశాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..