Bengaluru Accident: నిర్లక్ష్యం ఖరీదు.. 21ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని స్పాట్ డెడ్.. ఉలిక్కిపడేలా చేసిన వీడియో వైరల్..
స్కూటర్లు నడుపుతూ అమ్మాయిలు ప్రమాదాలకు గురవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అమ్మాయిలకు డ్రైవింగ్ సరిగా రాదంటూ ట్రోల్ చేస్తున్నారు. కానీ, ప్రతి సారి మహిళలు, అమ్మాయిల తప్పు కాదని ఇలాంటి వీడియోలు చూసినప్పుడు అర్థమవుతుంది. ఇకపోతే, ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు
Accident Viral Video: రోడ్డు ప్రమాదాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో డ్రైవరు తప్పిదం వల్ల కొన్ని ప్రమాదాలు కనిపిస్తే, మరికొందరి తప్పిదం వల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అది అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలిపేందుకు ఉదాహరణగా ఉంది ఈ వీడియో. ఈ వీడియోలో తప్పు ఇరువైపులా ఉందని తేలిపోయింది. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బెంగళూరులో జరిగిన ఈ ఘటనలో 21 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం జరిగిన భయానక దృశ్యాలు బస్సులోని సీసీటీవీలో రికార్డయ్యాయి. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావటంతో నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు.
ఈ వీడియోలో ఓ బస్సు ప్రమాదకరంగా వెళుతున్న దృశ్యం కనిపించింది. బస్సులో కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు. బయట ఓ యువతి స్కూటర్‌పై వెళుతుండగా, ఆమె ఒక్క క్షణంలో వెళ్లిపోయింది. అకస్మాత్తుగా బస్సు ఢీకొన్న యువతి బస్సు కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అందిన సమాచారం ప్రకారం.. బెంగళూరులోని మల్లీశ్వర్‌లోని హరిశ్చంద్ర ఘాట్ సమీపంలో శనివారం రోజున ఈ ఘటన జరిగింది. బస్సు డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ వీడియో @HateDetectors పేరుతో X ఖాతా ద్వారా పోస్ట్ చేయబడింది. చాలా మంది నెటిజన్లు ఈ వీడియోను పదే పదే చూస్తున్నారు. అంతేకాకుండా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
A second-year engineering student died on the spot after a #BMTCBus knocked down her two-wheeler near #HarischandraGhat in #Bengaluru‘s #Malleswaram when she was on her way to college today morning.
The deceased was identified as Kusumitha (20), a student at #JainCollege. The… pic.twitter.com/X03u58GIKl
— Hate Detector 🔍 (@HateDetectors) February 2, 2024
స్కూటర్లు నడుపుతూ అమ్మాయిలు ప్రమాదాలకు గురవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అమ్మాయిలకు డ్రైవింగ్ సరిగా రాదంటూ ట్రోల్ చేస్తున్నారు. కానీ, ప్రతి సారి మహిళలు, అమ్మాయిల తప్పు కాదని ఇలాంటి వీడియోలు చూసినప్పుడు అర్థమవుతుంది. ఇకపోతే, ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. కొన్ని వీడియోలు చూసిన తర్వాత అందరూ షాక్ అవుతున్నారు. ఈ ప్రమాదాన్ని నివారించాలంటే ఎప్పుడూ అప్రమత్తంగా ఉండటమే ఏకైక మార్గం.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..