AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ట్రైనింగ్ ఇద్దామనుకున్నాడు.. కానీ ఎలుగుబంటి దెబ్బకు ఇలా..

సర్కస్ లలో.. జూలలో జంతువులు తమ ట్రైనర్స్ చెప్పిన మాట విని.. ఏం చేయమంటే అది చేస్తుంటాయి. అలాంటివి చూసినప్పుడు మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

Viral Video: ట్రైనింగ్ ఇద్దామనుకున్నాడు.. కానీ ఎలుగుబంటి దెబ్బకు ఇలా..
Bear
Rajeev Rayala
|

Updated on: Apr 25, 2022 | 3:54 PM

Share

Viral Video: సర్కస్ లలో.. జూలలో జంతువులు తమ ట్రైనర్స్ చెప్పిన మాట విని.. ఏం చేయమంటే అది చేస్తుంటాయి. అలాంటివి చూసినప్పుడు మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎంతటి క్రూర మృగమైనా ట్రైనింగ్ ఇస్తే తన ట్రైనర్ ఎలా చెప్తే ఆలా చేస్తుంది. అయితే వాటికి ట్రైనింగ్ ఇవ్వడం అంటే మాములు విషయం కాదు. అవి ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాయో చెప్పలేం.. ఒకొక్కసారి ఊహించని దాడులు చేస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ ఎలుగు బంటికి ట్రైనింగ్ ఇద్దమని అనుకుంటే ఊహించని షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా ఆ ఎలుగుబంటి చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు. ఇంతకు ఆ ఎలుగుబంటి ఏంచేసిందంటే..

ఈ సంఘటన  వెస్ట్ వర్జీనియాలో జరిగింది. రాకీ అనే ఎలుగుబంటికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఓ వ్యక్తి గ్రౌండ్ లో నిలుచొని ఉన్నాడు. అతడి దగ్గరకు ఆ ఎలుగుబంటి వచ్చి అతడి చుట్టూ చూస్తుంది. ఆవెంటనే అది రెండు కాళ్లమీద నిలబడి అతడి పై ఒక్కసారిగా దాడి చేసింది. ఎలుగుబంటి ఒక్కసారిగా మీదపడటంతో అతడు కిందపడిపోయాడు. అది వెంటనే అతడి గొంతును నోటితో పట్టుకొని కొరికేసింది. వెంటనే అక్కడ ఉన్నవారి దానిని కొట్టడం మొదలు పెట్టారు. అయినప్పటికీ అది వదలకుండా అతడిని గొంతు పట్టుకొని అటు ఇటు విసిరేసింది. దాంతో అతడు చనిపోయాడు. ఈ ఘటన జరిగి చాలా కాలమే అయినా.. ఈ వీడియో మాత్రం ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. వెనులో వణుకుపుట్టిస్తున్న ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Photo Puzzle: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో జింకను కనిపెడితే మీ ఐ పవర్ సూపర్ అంతే

Viral Video: మీ చిన్నతనంలో ఇలాంటి తుంటరి గేమ్‌ ఎప్పుడైనా ఆడారా.. పగలబడి నవ్వుతారు..!

Viral Video: దూసుకుపోతున్న వాహనం.. అంతలోనే అనుకోని అతిథి ఎంట్రీ.. షాకైన డ్రైవర్‌..

Follow Us