సరీసృపాలలో నాగుపాము అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు. దాన్ని దూరం నుంచి చూస్తేనే జనాలు భయపడిపోతారు. అలాంటిది కోబ్రా వేటాడితే ఇంకేమైనా ఉందా.? అంతే సంగతులు.! తాజాగా సోషల్ మీడియాలో నాగుపాము వేటకు సంబంధించిన ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని సబి సాండ్స్ గేమ్ రిజర్వు నేషనల్ పార్క్‌లో చోటు చేసుకుంది. అదేంటో చూసేద్దాం..
వైరల్ వీడియో ప్రకారం.. అనూహ్యంగా ఓ నాగుపాముకు ఉడుము చిక్కింది. కోబ్రాకి చిక్కిందంటే.. ప్రాణాలు పోయినట్లే. ఆ ఉడుము పాము నుంచి తప్పించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తుంది. అయితే లాభం లేకుండా పోయింది. నాగుపాము ఉడుమును చుట్టేసి అమాంతం మింగేస్తుంది. ఇక ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కాగా, ఈ వీడియో పాతదే అయినప్పటికీ మరోసారి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇప్పటిదాకా 5.36 లక్షల వ్యూస్ సంపాదించినా ఈ వీడియోకు 2.4 వేల లైకులు వచ్చాయి. ‘పాపం కోబ్రాకు చిక్కి ఉడుము ప్రాణాలు కోల్పోయింది’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘ఈ పోరులో నాగుపాము ఆధిపత్యం ప్రదర్శించిందని’ మరొకరు కామెంట్ చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: ఉపకారం మరువని ఉడత… వీడియో చూస్తే మైమరచిపోతారు
ప్రతి ఒక్కరు విమానంలో తినే సదా అవకాశం… ఎయిర్‌క్రాఫ్ట్ రెస్టారెంట్.. ఎక్కడ ఉన్నదో తెలుసా..??