సోషల్ మీడియాలో అనేక వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. అందులో మనల్ని కొన్ని నవ్విస్తే.. మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయి. ఇంకొన్ని మనసుకు హత్తుకునేలా ఉంటాయి. అలాంటి కోవకు చెందిన ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పిల్లల క్రియేటివిటీని మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి లేట్ ఎందుకు ఆ వీడియో ఏంటో చూసేయండి.
వైరల్ అవుతున్న వీడియోలో, కొంతమంది పిల్లలు టెలివిజన్ స్క్రీన్‌లో మ్యాచ్ చూస్తున్నట్టు మీరు చూడవచ్చు. అయితే ఒక్క క్షణంలో ఆగండి.. బ్యాట్స్‌మెన్ కొట్టిన బంతి టీవీ నుంచి బయటికి రావడం మీకు కనిపిస్తుంది. చూస్తున్న పిల్లలు ఆ బంతిని క్యాచ్ పట్టుకుంటారు. దాన్ని చూసిన తర్వాత.. అది టీవీలో వస్తోన్న మ్యాచ్ కాదని.. లైవ్‌లో జరుగుతోన్న మ్యాచ్ అని అర్ధమవుతుంది.
ఈ ఫన్నీ వీడియోను పంచుకుంటూ, ఆనంద్ మహీంద్రా ‘ఇది పాత వీడియో, కానీ చూసిన తర్వాత ఈ మహమ్మారి ప్రతి దాన్ని ఎలా మార్చిందో నాకు గుర్తుకు వచ్చింది.” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో చూసిన తరువాత, నెటిజన్లు దానిపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. పిల్లలు చూపించిన సృజనాత్మకతకు సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ వీడియోను లక్ష మందికి పైగా వీక్షించగా.. 10 వేల మందికి పైగా లైక్ చేశారు. అలాగే రీ-ట్వీట్స్, కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
An old video. But it reminded me today of how the pandemic has forced us to put a ‘Screen’ in front of every activity. I want to crawl through that screen and experience the “real” thing again… pic.twitter.com/FjvxUsv7Gm
— anand mahindra (@anandmahindra) September 12, 2021
వరుడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వధువుకు మాత్రం షాక్.. వీడియో వైరల్
కలుపు మొక్కగా పెరిగే ఈ మొక్క.. మహిళలకు దివ్య ఔషధం.. ఆయుర్వేద మెడిసిన్.. ఆరోగ్యప్రయోజనాలు ఏమిటంటే
వరుడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వధువుకు మాత్రం షాక్.. వీడియో వైరల్