Viral: వీళ్లు నిజంగా జాతిరత్నాలు.. ఫ్రెండ్ శోభనానికి విషెస్ చెబుతూ ఊరంతా బ్యానర్లు, ఫ్లెక్సీలు!
ఎలక్షన్ల టైంలో రాజకీయ నాయకులు, సినిమా రిలీజ్ సమయాల్లో హీరోల కటౌట్లు, బ్యానర్లను మనం చూస్తూనే ఉంటాం. ఇక ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు కూడా..

ఎలక్షన్ల టైంలో రాజకీయ నాయకులు, సినిమా రిలీజ్ సమయాల్లో హీరోల కటౌట్లు, బ్యానర్లను మనం చూస్తూనే ఉంటాం. ఇక ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు కూడా కొన్ని చోట్ల పెద్ద పెద్ద బ్యానర్లు దర్శనమిస్తున్నాయ్. ఇంతవరకూ బాగానే ఉంది గానీ.. ఇక్కడొక ఓ వ్యక్తికి మాత్రం అతడి ఫ్రెండ్స్ ఊహించని ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి.. షాక్ కలిగించారు. ఇంతకీ అదేంటంటే.. ఆ ఫ్రెండ్ శోభనానికి విషెస్ చెబుతూ ఏకంగా ఫ్లెక్సీలు, బ్యానర్లను గ్రామం మొత్తం ఏర్పాటు చేశారు. వినడానికి ఇది మీకు కొంచెం కొత్తగా అనిపించినా.. నిజంగా ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.
స్థానిక మంగళూరుకు చెందిన ఓ యువకుడికి ఇటీవలే వివాహం జరిగింది. అతడు ఫస్ట్ నైట్‌కు సిద్దం అవుతుండటంతో.. మనోడి ఫ్రెండ్స్ వినూత్నంగా ప్రయత్నించి.. ఫ్రెండ్ శోభనానికి విషెస్ చెబుతూ గ్రామమంతా బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇంతకీ వాళ్లు విషెస్ ఏం చెప్పారో తెలుసా.? ‘రాత్రంతా పోరాడి గెలువు మిత్రమా’ అని బ్యానర్, ఫ్లెక్సీపై కామెంట్ పెట్టారు. కాగా, ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.
