
సాధారణంగా మార్కెట్‌లో లభించే కొబ్బరికాయలు 500 గ్రాముల నుంచి 1.5 కిలోల వరకు బరువు ఉంటాయి. వాటిలో ఉండే నీరు కూడా పరిమితంగానే ఉంటుంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో కనిపించిన కొబ్బరికాయ మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏకంగా 7 కిలోల బరువున్న ఈ భారీ కొబ్బరికాయను నెటిజన్లు ‘బాహుబలి కొబ్బరికాయ’గా అభివర్ణిస్తున్నారు.
ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన ఈ వీడియోలో ఓ కొబ్బరికాయల వ్యాపారి భారీ సైజులో ఉన్న కొబ్బరికాయను కత్తితో ఒలుస్తూ కనిపించాడు. సాధారణ కొబ్బరికాయలతో పోలిస్తే ఇది ఎన్నో రెట్లు పెద్దదిగా ఉండటంతో వీడియో చూసినవారంతా షాక్‌కు గురవుతున్నారు. వ్యాపారి కొబ్బరికాయను ఒలుస్తున్న సమయంలోనే దాని నుంచి నీరు కారడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. దీంతో అందులో ఎంత నీరు ఉంటుందోనని నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
వీడియోలో చెప్పిన వివరాల ప్రకారం ఈ కొబ్బరికాయ బరువు సుమారు 7 కిలోలు. అంతేకాదు ఇందులో రెండు లీటర్లకు పైగా కొబ్బరి నీరు ఉంటుందని పేర్కొన్నారు. సాధారణంగా ఒక కొబ్బరికాయలో 250 నుంచి 500 మిల్లీలీటర్ల వరకు మాత్రమే నీరు ఉంటుంది. కానీ ఈ బాహుబలి కొబ్బరికాయలో ఉండే నీరు నలుగురు సభ్యుల కుటుంబం దాహాన్ని సులభంగా తీర్చగలదని చెబుతున్నారు.
ఈ వీడియోను bokaro_wholesale_coconut అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా షేర్ చేయగా లక్షలాది మంది వీక్షించారు. వేల సంఖ్యలో లైక్‌లు, కామెంట్లు వచ్చాయి. “ఇది కొబ్బరికాయ కాదు.. చిన్న వాటర్ ట్యాంక్‌లా ఉంది”, “ఒక్క కొబ్బరికాయతో కుటుంబం మొత్తం సరిపోతుంది”, “దీని ధర ఎంత ఉంటుందో తెలుసుకోవాలనిపిస్తోంది” అంటూ నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. అయితే ఈ భారీ కొబ్బరికాయ ఎక్కడ పండింది, దాని అసలు ధర ఎంత అనే విషయాలు మాత్రం వీడియోలో వెల్లడించలేదు. అయినప్పటికీ ఈ ‘బాహుబలి కొబ్బరికాయ’ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
‘బాహుబలి కొబ్బరికాయ’ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చూడండి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..