సోషల్ మీడియా అంటేనే సరదా.. సందడి.. ఇంకా అంతకంటే ఎక్కువే అని చెప్పాలి. ఎందుకంటే ఇందులో వచ్చే వీడియోలు చాలా హుషారైన.. అటెన్షన్ వీడియోలు వస్తుంటాయి. ఇవి ఎవరి ముఖంలోనైనా చిరునవ్వు తెస్తుంది. అలాంటి సరదా వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో బుజ్జి ఏనుగు.. ఓ పక్షితో సరదాగా గొడవపడటం చూస్తే ఎవరికైన నవ్వు వస్తుంది. అది చూసి అందరి ముఖాలు చిరు నవ్వులుతో విప్పుకుంటాయి. ఏనుగు పిల్లలు ఎత్తుగా, తెలివైనది కావచ్చు.. కానీ అవి ఏ చిన్న పిల్లల వలె.. చాలా కొంటెగా వ్యవహరిస్తుంది. కొత్త స్నేహం కోసం ఏనుగు పిల్ల ఇతర జంతువుల పిల్లలతో ఆడుకుంటున్న వీడియోలను మనం గతంలో చూశాం. ప్రస్తుతం, ఓ కొత్త వీడియో పిల్ల ఏనుగు పక్షిని కలవరపెడుతుంది. ఆ తర్వాత ఆ పక్షి ఏనుగు పిల్లను ఉరుకులు.. పరుగులు పెట్టించింది.
వైరల్ అవుతున్న ఈ క్లిప్‌ను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా షేర్ చేశారు. ఇందులో ఒక అందమైన ఏనుగు పిల్ల.. ఒక పక్షి ఓ చిన్న నీటి కొలను వద్ద నీరు త్రాగుతూ కనిపిస్తాయి. ఆ సమయంలో పిల్ల ఏనుగు తన తొండంతో పక్షిపై నీటిని పిచికారీ చేస్తుంది. ఆ తర్వాత ఏనుగు పిల్లా ఈ సరదాకి ఆ పక్షి కౌంటర్ ఇస్తుంది.
किसी को छोटा जानकर उसे तंग करना, मूर्खता है.
क्योंकि नन्हा पक्षी भी हाथी को नाच नचा सकता है. pic.twitter.com/AEpBFJyiDz— Dipanshu Kabra (@ipskabra) May 26, 2022
వీడియోను పోస్ట్ చేసిన దీపాంశు కబ్రా క్యాప్షన్‌లో ఇలా రాశారు. ‘ఒకరిని చిన్నవారని తెలిసి వారిని వేధించడం మూర్ఖత్వం. ఎందుకంటే చిన్న పక్షి కూడా ఏనుగును డ్యాన్స్ చేయిచగలదు.’ అని క్యాప్షన్ పెట్టారు. పక్షి పగ తీర్చుకోవడానికి ఏనుగు పిల్ల వెంట పడిపోవడం.. ఏనుగు పిల్ల చుట్టూ పరిగెత్తడం ద్వారా అతనికి ఆటంకం కలిగించడం వీడియోలో మరింత ఫన్నీగా ఉంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఈ వీడియోను చూసిన తర్వాత సోషల్ మీడియా యూజర్లు చాలా సంతోషంగా ఉంటారు. వార్తలు రాసే వరకు ఈ వీడియోకు 34 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.