
సోషల్ మీడియాలో ఒక గున్న ఏనుగుకి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఇందులో అడవి నుంచి బయటకు వస్తున్న పిల్ల ఏనుగును చూస్తే.. ఒక పార్కులో ఆడుకుంటున్న పిల్లాడిలా అనిపిస్తుంది. ఈ ఏనుగు తన సొంత ప్రపంచంలో మునిగిపోయింది. అడవి నుంచి గున్న ఏనుగు రోడ్డుమీదకి అడుగు పెట్టె సముయంలో దాని కాలికి పొద చుట్టుకుంది. అది ముందుకు అడుగు వెయ్యకుండా అడ్డుకుంది. ఆ పొద “బిడ్డా, ఈ రోజు నిన్ను ఇక్కడే ఆపేస్తాను” అని నిర్ణయించుకున్నట్లుగా ఉంది. పొదలోని కొంత భాగం తాడులా ఏర్పడి ఏనుగు కాలిని చిక్కుకుంది. దీంతో ఏనుగుకి చికాకు వచ్చినట్లు ఉంది. అది తన బలాన్ని ఉపయోగించింది. తన తొండం ఊపింది, తన పాదాలతో ఆ పోదని తొక్కింది. అయితే ఆ పొద ఎగిరి దాని చిన్న దంతాలలో ఇరుక్కుపోయింది. అప్పుడే అసలు నాటకం ప్రారంభమైంది.
గున్న ఏనుగును కలవరపెట్టిన పొద
తనని అడ్డగించిన పొదపై ఆ పిల్ల ఏనుగుకి కోపం వచ్చేసింది. ఆ పొదను రోడ్డుపైకి లాక్కుని వచ్చి.. ఓ రేంజ్ లో విధ్వంసం సృష్టించింది. ఇది చూస్తే మీరు నవ్వి నవ్వి అలసిపోతారు. మొదట ఆ పొదను తన కాళ్ళ కింద వేసి తొక్కింది. తరువాత దానిని తన్ని, చివరికి తన తొండంతో దానికి గుణపాఠం నేర్పింది. ఈ సమయంలో గున్న ఏనుగు ఆ పొద చేసిన అల్లరి అంతా దుమ్ముగా మారిపోయింది. ఈ చిన్న ఏనుగు తాను పొదతో చేసిన యుద్ధంలో గెలిచి.. “ఇప్పుడు నన్ను ఎవరు ఆపుతారో చూద్దాం” అని చెబుతున్నట్లుగా ముందుకు కదిలింది.
ఈ సరదా వీడియో చూసి నవ్వుతున్న నెటిజన్లు
ఆ చిన్న ఏనుగు వీడియో చాలా ఫన్నీగా ఉంది. దీనిని చూసిన వెంటనే పగలబడి నవ్వుతారు. ఆ గున్న ఏనుగు చేసే అమాయకమైన అల్లరి , దాని కోపం అందరికీ ప్రేమని కలిగిస్తుంది. నవ్వులతో నింపుతుంది. ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని మళ్లీ మళ్లీ చూసిన తర్వాత బిగ్గరగా నవ్వుతున్నారు. ఈ వీడియోను aanakazhchakalum_viseshangalum అనే యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. దీనిలో వేలాది మంది స్పందిస్తున్నారు. 50 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేసి వ్యాఖ్యానించారు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..